ఐపీఎల్ 2024 సీజన్ కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్ కమింగ్ సీజన్ కి మరో 8 రోజుల్లో తెరలేవనుండగా.. ఆర్సీబీ తమ పేరును మార్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. 16 ఏళ్లుగా ఆ జట్టు టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. ఇప్పటికే టీమ్ లోగో తో పాటు కోచ్ లను మార్చినప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఈ తరుణంలో తమ పేరులో స్వల్ప మార్పు చేయాలని ఆర్సీబీ భావిస్తోందట. ఇంగ్లీషు స్పెల్లింగ్ ను మార్చాలనుకుంటున్నట్టు సమాచారం.
Advertisement
ప్రస్తుతం అప్ కమింగ్ సీజన్ లో ఆర్సీబీ మార్చనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆర్సీబీ షేర్ చేసినటువంటి ఓ వీడియోలో ఈ విషయం స్పష్టమైంది. శాండల్ వుడ్ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి.. రాయల్, ఛాలెంజర్స్, బెంగళూరు అని వేర్వేరుగా రాసిన మూడు దున్నల్లో ఒక దున్నను గెదుముతాడు. ఆ దున్నపై బెంగళూరు అని రాసి ఉంది. ఆ వెంటనే అర్థమైందా..? అని కన్నడలో ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ರಿಷಬ್ ಶೆಟ್ಟಿ ಎನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅರ್ಥ ಆಯ್ತಾ?
Understood what Rishabh Shetty is trying to say?
Advertisement
You’ll find out at RCB Unbox. Buy your tickets now. 🎟️@shetty_rishab #RCBUnbox #PlayBold #ArthaAytha #ನಮ್ಮRCB pic.twitter.com/sSrbf5HFmd
— Royal Challengers Bangalore (@RCBTweets) March 13, 2024
బెంగళూరు నగరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికేటేతర ఫ్రాంచైజీలు కూడా తమ పేరులో Bangaloreకు బదులు Bengaluru అని రాస్తున్నాయి. మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్న అన్ బాక్స్ ఈవెంట్ లో ఈ పేరు మార్పు పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మార్చి 22న చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బీసీసీఐ.. 22 మ్యాచ్ ల షెడ్యూల్ ను మాత్రమే ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ తరువాత మిగతా మ్యాచ్ లకి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించనున్నట్టు సమాచారం.