ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న ఆటలో క్రికెట్ కూడా ఒక్కటి. అయితే ఈ క్రికెట్ లో ఉండే లెజెండ్స్ కు గౌరవార్థంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హల్ ఆఫ్ ఫేమ్ ను ప్రారంభించింది. ఇందులో ప్రతి ఏడాది క్రికెట్ కు సేవలు చేసిన కొంత మంది ఆటగాళ్లను చేర్చుతుంది. అయితే ఇప్పుడు సంప్రదాయాన్ని మన ఐపీఎల్ లోకి కూడా తీసుకొచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు. తాజాగా తమ జట్టుకు ఎన్నో సేవలు చేసిన ఇద్దరు క్రికెటర్లను తమ హల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చుతున్నట్లు ప్రకటించింది.
Advertisement
అయితే ఆ జట్టు మాజీ కెప్టెన్.. ప్రస్తుత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాడు. అందులో ఒక్కరు టీ20 స్పెషలిస్ట్ క్రిస్ గేల్ కాగా.. మరొకరు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. వీరిద్దరిని రాయల్ ఛాలెంజర్స్ తమ మొదటి హల్ ఆఫ్ ఫేమ్ సభ్యులుగా ప్రకటించింది. విరాట్ కోహ్లీ ఆ ఇద్దరి జెర్సీ నంబర్లతో కూడిన మొమెంటోను ఆవిష్కరించారు. అలాగే ఆ సమయంలో ఆ ఇద్దరి ఆటగాళ్లతో తనకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
Advertisement
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… డివిలియర్స్ కారణంగా మనకు క్రికెట్ లో కొత్త కొత్త షాట్స్ ను చూసే ఆవకాశం లభించింది అని తెలిపాడు. అలాగే గేల్ లో తాను 2016 లో ఆడిన ఇన్నింగ్స్ లను.. ముఖ్యంగా అప్పటి గుజరాత్ లయన్స్ పై ఆడిన ఇన్నింగ్స్ ను ఎప్పటికి మర్చిపోను అని తెలిపాడు. ఇక ఈ కార్యక్రమంలో గేల్ ఆలాగే డివిలియర్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అయితే గేల్ బెంగళూర్ తరపున ఐపీఎల్ లో 2011 నుండి 2017 వరకు ఆడగా… 2011 నుండి 2021 వరకు ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
ఇవి కూడా చదవండి :
ఇంగ్లాండ్ పర్యటనకు రహానే దూరం..!
నేను మా సీఈవో పేరు అందుకే తీసాను : శ్రేయాస్