Home » మొదటి సారి విలన్ పాత్రలో రవితేజ….!

మొదటి సారి విలన్ పాత్రలో రవితేజ….!

by AJAY
Ad

క్రాక్ విజయంతో మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే రవితేజ ఖిలాడి సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగానే రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ను రావణాసుర అని ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు.

raviteja

raviteja

కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుండి రవితేజ పోస్టర్ ను విడుదల చేయగా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఫుల్ లెంత్ నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మొదటిసారి రవితేజ తన కెరీర్ లోనే నెగిటివ్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. రవితేజ ఇప్పటివరకు హీరోగానే అదరగొట్టారు కానీ ఈ చిత్రంలో రవితేజ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

Advertisement

raviteja

raviteja

ఇక విలన్ పాత్రకు తగినట్టుగా ఈ సినిమా పేరు రావణాసుర అని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా దక్షా నాగార్కర్ మరియు పూజిత పొన్నాడ కూడా కీలక పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ వర్మ నిర్మిస్తున్నారు.

Visitors Are Also Reading