టీం ఇండియా ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడుతున్న విషయంలో తెలిసిందే. ఇన్దులొ మొదట పాకిస్థాన్ పై ఆ తర్వాత హాంగ్ కాంగ్ పై గెలిచినా భారత జట్టు సూపర్ 4కి వెళ్ళింది. ఈ విషయంలో ఆనందపడుతున్న సమయంలోనే అందరికి షాక్ తగిలింది. టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కాణంగా జట్టుకు దూరం అవుతున్నాడు అని బీసీసీఐ ప్రకటించింది.
Advertisement
అయితే హాంగ్ కాంగ్ మ్యాచ్ తర్వాత ప్రాక్టీస్ సమయంలో రవీంద్ర జడేజాకు కాలి బొటనవేలుకు గాయం అయ్యింది. ఈ కారణంగానే అతడు మొత్తం ఆసియా కప్ కు కూడా దూరం కాబోతున్నాడు అని బీసీసీఐ ప్రకటించింది. కానీ ఇప్పుడు అందరికి మరో షాక్ తగనున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే జడేజా కేవలం ఆసియా కప్ కు మాత్రమే కాకుండా టీ20 ప్రపంచ కప్ కూడా దూరం కాబోతున్నాడు అని తెలుస్తుంది.
Advertisement
అయితే గాయంతో జట్టు నుండి తప్పుకున్న జడేజా ఆకుపత్రికి వెళ్లగా.. అక్కడ జడేజాకు అయిన గాయం పెద్దగా ఉంది అని.. దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది అని వైద్యులు ప్రకటించినట్లు తెలుస్తుంది. ఈ సర్జరీ తర్వాత కనీసం రెండు నెలల కంటే ఎక్కువ సమయం కోలుకోవడానికి జడేజాకు పడుతుంది అని తెలుస్తుంది. కానీ వచ్చే నెల అక్టోబర్ లోనే ప్రపంచ కప్ ఉండటంతో దానికి జడేజా దాదాపుగా దూరం అయ్యినట్లే అని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :