మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది క్రాక్ అనే సినిమాతో హిట్ అందుకున్న రవితేజ… ఈ ఏడాది ఖిలాడీ అనే సినిమా విడుదల చేసాడు. కానీ అది అంతగా అభిమానులను ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే మరో సినిమాను ప్రజల ముందుకు తీసుకువచ్చాడు రవితేజ. అయితే ఈ సినిమా విడుదల తర్వాత మొదటి రోజే మిక్స్డ్ టాక్ అనేది తెచ్చుకుంది.
Advertisement
కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుతూ మరో ప్లాప్ సినిమా రవితేజ ఇచ్చాడు అన్ని అంటున్నారు. అందువల్ల ఈ సినిమా యొక్క నిర్మాత సుధాకర్ కు నష్టం అనేది రావడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదల కు ముందు రవితేజ, నీమాత సుధాకర్ కు మధ్య గొడవలు కూడా జరిగినట్లు తెలిసింది. కానీ అలాంటిది ఏం లేదు అని రవితేజ పేర్కొన్నారు.
Advertisement
ఇక ఇప్పుడు మరోసారి ఓ సంచలన నిర్ణయం అనేది తీసుకున్నాడు రవితేజ. రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ప్లాప్ కావడంతో నిర్మాత నష్టం గురించి ఆలోచించి రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే… ఈ నష్టాన్ని పూర్చడానికి ఈ నిర్మాతతో మరో సినిమాను అది కూడా తక్కువ రెమ్యునరేషన్ తో చేయాలనీ రవితేజ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. దాంతో వీర్ మధ్య ఎలాంటి వినేదాలు అనేవి లేవు అని మరోసారి రుజువవుతోంది.
ఇవి కూడా చదవండి :