Home » ధోనీ, కోహ్లీ రికార్డులపై మహిళా ప్లేయర్స్ ఆధిపత్యం..!

ధోనీ, కోహ్లీ రికార్డులపై మహిళా ప్లేయర్స్ ఆధిపత్యం..!

by Azhar
Ad
భారత్ లో ఒక్కప్పుడు క్రికెట్ అంటే కేవలం పురుషుల జట్టు మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు మహిళల జట్టుకు కూడా ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది. ఇక అందులోని ప్లేయర్స్ కు కూడా బాగానే ఫ్యాన్స్ అనేవారు ఉంటున్నారు. అయితే ప్రస్తుతం భారత మహిళల జట్టు అనేది కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటుంది. అందులో భాగంగా నేడు పాకిస్థాన్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే మన మహిళా క్రికెటర్స్ కొన్ని రికార్డులను నెలకొల్పారు.
అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 99 పరుగులకే ఆల్ ఔట్ కాగా… భారత జట్టు 11.4 ఓవర్లలోనే విజయం సాధించింది. అయితే ఈ విజయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు ను బ్రేక్ చేసింది. భారత కెప్టెన్ గా అత్యధిక టీ20 విజయాలు అందుకున్న కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ నిలిచింది. ఇది హర్మన్‌ప్రీత్ కు కెప్టెన్ గా 42వ విజయం. కానీ ఈ లిస్ట్ లో ఇంతకముందు ధోని టాప్ లో ఉండేవాడు. కానీ ఇప్పుడు 41 విజయాలతో ధోని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ 30 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఇక టీం ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కూడా తన పేరిట కొన్ని రికార్డులు నెలకొల్పింది. అయితే ఈ మ్యాచ్ యొక్క లక్ష్య ఛేదనలో 63 పరుగులు చేసి విజయంలో కీలకంగా నిలిచిన స్మృతి మంధాన.. టీ20 ఛేజింగ్ లో 1000 పరుగులు చేసిన మొదటి మహిళా క్రికెటర్ గా నిలిచింది. ఈ హాఫ్ సెంచరీతో స్మృతి ఛేజింగ్ లో మొత్తం 1059 పరుగులు చేసింది. అలాగే పాకిస్థాన్ పై చివరిగా ఆడిన వన్డే మరియు టీ20 లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా కోహ్లీ సరసన నిలిచింది. కోహ్లీ కూడా పాక్ పై తన చివరి వన్డే, టీ20 ల్లో అర్ధశతకం చేసాడు.

Advertisement

Visitors Are Also Reading