భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా ఫామ్ లో లేడు అనే విషయం తెలిసిందే. ఒక్కపుడు పరుగుల వరద పారించిన కోహ్లీ ఇప్పుడు మాత్రం క్రీజులో నిలుచోలేకపోతున్నాడు. కేవలం అంతర్జాతీయ క్రికెట్ అనే కాదు.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 15 సీజన్ లోను ఘోరంగా విఫలమయ్యాడు. దాంతో కోహ్లీ పై తీర్వ విమర్శలు అనేవి రావడం మొదలయ్యాయి. అతడిని జట్టు నుండి తీసేయాలని కూడా చాల మంది కామెంట్స్ చేసారు.
Advertisement
అయితే కోహ్లీ ఇలా ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అని చాల మంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దానికి సమాధానం పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తెలిపాడు.విరాట్ కోహ్లీ ఇలా ఫామ్ కోల్పోయి విమర్శలపాలు కావడానికి టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రినే కారణం అని లతీఫ్ తెలిపాడు. కోచింగ్ లో కనీసం బేసిక్స్ కూడా తెలియని రవి శాస్త్రికి టీం ఇండియా హెడ్ కోచ్ పదవిని ఇచ్చారు. అది కూడా దిగ్గజ అనిల్ కుంబ్లేను తీసేసి. ఈ రవి శాస్త్రి వచ్చిన తర్వాతే కోహ్లీ బ్యాటింగ్ లో పదును అనేది తగ్గిపోయింది.
Advertisement
అసలు రవి శాస్త్రి కేవలం ఒక్క కామెంటేటర్ గా మాత్రమే పని చేస్తాడు. అంతేకాని అతడిని కోచింగ్ కు సంబంధం లేదు. అయితే అతనికి ఈ బాధ్యతలు ఇవ్వడం వెనుక ఏ కథలు నాచిచాయో నాకు తెలియదు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. కానీ ఈ తప్పుడు ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది మాత్రం విరాట్ కోహ్లీ అని లతీఫ్ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం భారత హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత రవి శాస్త్రి టీం ఇండియా హెడ్ కోచ్ గా తప్పునా విషయం అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :