Home » Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?

Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?

by Bunty

బిగ్ బాస్ సీజన్ సెవెన్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే గతవారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అందులో అశ్విని, రతిక ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇక అశ్విని తనకు తానుగా నామినేట్ చేసుకొని ఎలిమినేట్ అయింది. ఇక రాతిక మాత్రం గేమ్ ఆడకపోవడం వల్లే ఎలిమినేట్ అయిందని అందరూ అంటున్నారు. రతిక మొదట బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే ఎలిమినేట్ అయ్యింది.

Rathika Rose earnings from Bigg Boss Telugu 7

Rathika Rose earnings from Bigg Boss Telugu 7

మళ్లీ తనకు రెండవ అవకాశం వచ్చి హౌస్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ తన ఆటను ఏమాత్రం కొనసాగించలేకపోయింది. ఎంతో అందంగా, చలాకీగా కనిపించే రతిక ఆట విషయంలో చాలా భయపడుతూ కాస్త వెనకడుగు వేయడంతో ఈ వారం ఓటింగ్ ప్రకారం రాతిక ఎలిమినేట్ అయింది. హౌస్ లో ప్రశాంత్ తో మొదట లవ్ ట్రాక్ నడిపించి కాస్త ఫేమస్ అయ్యింది. కానీ ఆ తర్వాత తన మీద కొంచెం రివర్స్ అవడంతో రతిక మీద నెగిటివిటీ పెరిగిపోయింది.

మొదటిసారిగా రతిక నాలుగు వారాలు హౌస్ లో కొనసాగింది. ఇక మళ్ళీ రీఎంట్రీ తర్వాత ఐదు వారాలపాటు ఇలాంటి ఆట ఆడకుండా కేవలం సొల్లు కబుర్లు చెబుతూ అతికష్టం మీద హౌస్ లో కొనసాగింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో రతికకి వారానికి రెండు లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ని ఇచ్చారట. తాను ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం బిగ్ బాస్ రతికకి వారానికి రెండు లక్షలు అంటే తొమ్మిది వారాలకి కలిపి 18 లక్షల రూపాయలని ఇచ్చేసారట.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading