Home » బట్లర్ నా రెండో భర్త అంటున్న సఫారీ ఆటగాడి భార్య..

బట్లర్ నా రెండో భర్త అంటున్న సఫారీ ఆటగాడి భార్య..

by Azhar
Ad

ఐపీఎల్ 2022 ఈ నెల 29న ఫైనల్స్ తో ముగుస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచినా వారు గుజరాత్ టైటన్స్ తో ఫైనల్స్ ఆడుతారు. అయితే కరోనా కారణంగా బయో బాబుల్ మధ్య జరిగిన ఈ ఐపీఎల్ సీజన్ లో చాలా మంది ఆటగాళ్లు తన ఫ్యామిలీతో వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆటగాళ్ల భార్యలు కూడా ఈ బయో బబుల్ లో ఉన్నారు. అందులో చాలా మంది స్టేడియంలోకి వచ్చి ఆటగాళ్లను ఎంకరేజ్ చేసేవారు.

Advertisement

అయితే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగిన ప్రతిసారి చాహల్ భార్యతో పాటుగా మరో లేడీ కూడా కనిపించేది. ఆమె లారా డసెన్. తాజాగా లారా డసెన్ మాట్లాడుతూ.. జోస్ బట్లర్ నా రెండో భర్త అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎందుకంటే నేను బట్లర్ భార్యను కాను… కానీ అందరూ అలానే అనుకుంటున్నారు అని ప్రకటించింది. నా భర్త వాన్ డర్ డసెన్. రాజస్థాన్ జట్టులోని ఉన్న అతనికి ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం రాలేదు. అయిన కూడా నేను పతి మ్యాచ్ కు వచ్చి మా జట్టును ఎంకరేజ్ చేస్తుంటా..! ఈ క్రమంలోనే అందరూ నేను బట్లర్ భార్య అనుకున్నారు.

Advertisement

ఎందుకంటే.. బట్లర్ సిక్స్, ఫోర్ లేదా సెంచరీ, హాఫ్ సెంచరీ ఇలా ఏది కొట్టిన కెమెరా మాన్ నన్నే టీవీలో చూపించేవాడు. దాంతో అందరూ నేను బట్లర్ భార్య అనుకోవడం ప్రారంభించారు. కానీ బట్లర్ భార్య పేరు లూయిస్. నేను తనను ఇక్కడే కలిసాను. అయితే ఆమె మ్యాచ్ లకు రాదు. నా భర్త వాన్ డర్ డసెన్ ఎక్కువ మ్యాచ్ లు ఆడలేదు. అందుకే ఇలాంటి వార్తలు బయటికి వచ్చాయి అని ఆమె తెలిపింది.

ఇవి కూడా చదవండి :

RCB ని టైటిల్ పోరులో నిల‌బెట్టిన ఈ పాటిదార్ ఎవ‌రు? ఈ సిక్స్ మ్యాచ్ కే హైలెట్!!

పంజాబ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లనందుకు ధావన్ కు దెబ్బలు.. కిందపడేసి మరి..?

Visitors Are Also Reading