టాలీవుడ్ బ్యూటీ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయినది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ నిమిషం తీరిక లేకుండా తిరుగుతుంది. ఇక ఈ బిజీ షెడ్యూల్ ల్లో ప్రేమకు, పెళ్లికి తావు లేవని చెప్పుకొచ్చింది. తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రమోషన్స్ లో ప్రేమ, పెళ్లి పై ఈ అమ్మడు నోరు విప్పింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ఎవరి దగ్గర అయితే సెక్యూర్ గా ఫీల్ అవుతామో, కంఫర్ట్ గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటామనిపిస్తుందో అతడే జీవితానికి మంచి లైఫ్ పార్టనర్.. అలాంటి వాడినే భర్త గా ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది.
Advertisement
Advertisement
ఇక ప్రేమ పెళ్లిపై అమ్మడు మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు సమానంగా అర్ధం చేసుకున్నప్పుడు మాత్రమే అది ప్రేమ అవుతుంది. అలాకాకుండా ఒకరిని ఒకరు అర్ధం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే ఉంటుంది. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకొన్నా.. ఇంట్లోవారిని ఒప్పించే చేసుకుంటానని మనసులో మాట చెప్పుకొచ్చింది. ఇక రష్మిక గత కొన్ని రోజుల నుంచి విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసినదే. అయితే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఆమె చెప్పుకొస్తున్నారు. రష్మిక ఎవరినీ పెళ్లి చేసుకుంటుందో తెలియాలంటే అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read : IND vs WI: తొలి టీ-20లో టీమిండియా విజయం