Home » ఒకే ఇంట్లో ఉంటున్న‌ విజ‌య్ ర‌ష్మిక‌…ఆ ఫోటోతో అడ్డంగా బుక్కైన ల‌వ్ బ‌ర్డ్స్..?

ఒకే ఇంట్లో ఉంటున్న‌ విజ‌య్ ర‌ష్మిక‌…ఆ ఫోటోతో అడ్డంగా బుక్కైన ల‌వ్ బ‌ర్డ్స్..?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేర‌వ‌కొండ హీరోయిన్ ర‌ష్మిక డేటింగ్ లో ఉన్నారా..? ప్రస్తుతం ఈ జంట క‌లిసే ఉంటున్నారా అంటే అవున‌నే అంటున్నాయి మీడియా వ‌ర్గాలు. ఈ జంట మొద‌టిసారి గీతాగోవిందం సినిమాలో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా స‌మయంలోనే ర‌ష్మిక విజ‌య్ ప్రేమ‌లో ప‌డ్డారంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

Advertisement

 

ఈ సినిమా త‌ర‌వాత వీరిద్ద‌రూ క‌లిసి డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో కూడా న‌టించారు. అంతే కాకుండా ఆ త‌ర‌వాత వీరిద్ద‌రూ క‌లిసి సినిమాలు చేయ‌క‌పోయినా క‌లిసి చ‌క్క‌ర్లు కొడుతూ మీడియా కంట ప‌డ్డారు. అప్పట్లో ర‌ష్మిక విజ‌య్ క‌లిసి ఓ హోటల్ కు వెళ్ల‌గా వారికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

Advertisement

అంతే కాకుండా వీరిద్ద‌రూ విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిన ఫోటోలు కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఇద్ద‌రూ లవ్ లో ఉన్నారా అంటే మాత్రం నో అంటూ స‌మాధానం ఇస్తూ వ‌చ్చారు. అయితే తాజాగా ర‌ష్మిక పుట్టిన‌రోజు జ‌రిగింది. ఈ సంధర్బంగా థాంక్స్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది.

అయితే కాసేప‌టి అదే లొకేష‌న్ లో దిగిన ఫోటోను విజ‌య్ దేవ‌ర‌కొండ షేర్ చేశాడు. దాంతో ఇద్ద‌రూ ఒకే ఇంట్లో ఉంటున్నారంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అంతే కాకుండా ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ ర‌ష్మిక విజ‌య్ డేటింగ్ వార్త‌లు నిజ‌మేన‌ని ప్ర‌క‌టించింది. అంతే కాకుండా విజయ్ త‌న ఫేవ‌రెట్ రింగ్ ను ర‌ష్మిక‌కు తొడిగాడు అని పేర్కొంది. అక్క‌డితో ఆగ‌కుండా వాళ్లు ఒకే ఇంట్లో ఒకే రూమ్ లో ఉంటున్నార‌ని పేర్కొంది.

ALSO READ : అబ్బాయిలు ఈ లక్షణాలు కలిగి ఉంటే… అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు

Visitors Are Also Reading