నేషనల్ క్రష్ రష్మిక మందన రౌడీ హీరో విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక విజయ్ దేవరకొండ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. ఇక రష్మిక టాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడంతో తన బాయ్ ఫ్రెండ్ కు సైతం బ్రేకప్ చెప్పేసింది. ఎంగేజ్మెంట్ అప్పటికే జరిగి పోగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అందుకు కారణం కూడా రౌడీ హీరోనే అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఆ వార్తలకు బలం చేకూరేలా అప్పుడప్పుడు ఇద్దరూ మీడియా కంట పడుతున్నారు. రీసెంట్ గా కూడా ముంబైలోని ఓ హోటల్ నుండి వెళ్ళిద్దరూ బయటకు వస్తున్న వీడియో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరూ గోవా కలిసి వెళ్ళినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. న్యూయార్ సెలబ్రేషన్స్ కోసం రష్మిక మందన విజయ్ దేవరకొండ గోవా వెళ్లారని వార్తలు వచ్చాయి.
Advertisement
Advertisement
ఇప్పుడు ఆ వార్తలు నిజం అయ్యాయి కూడా…. అంతేకాకుండా వీరిద్దరూ గోవా వెళ్లినట్టు తెలియడానికి కారణం రౌడీ హీరో తమ్ముడు చిన్న రౌడీ దేవరకొండనే… న్యూయర్ సందర్భంగా గోవాలో దిగిన ఫోటోను రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసి హ్యాపీ న్యూయర్ అంటూ షేర్ చేసింది.
ఆ కొద్దిసేపటికే ఆనంద్ దేవరకొండ సైతం అదే లొకేషన్ లో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ రెండు ఫోటోలు చూసిన నెటిజన్లు ఫోటోలు ఎక్కడో చూసినట్టుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. పక్కనే పెద్ద రౌడీ కూడా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో రష్మిక దేవరకొండ ఫ్యామిలీ తో కలిసి గోవా ట్రిప్ కి వెళ్ళినట్టు కన్ఫామ్ అయ్యింది. ఇక ఇప్పటికే తమ రిలేషన్ షిప్ గురించి వార్తలు వస్తున్నాయని అనుకున్నారో ఏమో గానీ ఇద్దరూ కలిసి మాత్రం ఫోటోలు షేర్ చేయట్లేదు.
Also read : పెళ్లైన 8నెలలకే భర్తకు విడాకులిచ్చిన హీరోయిన్..కారణం ఏంటో తెలుసా..?