Telugu News » Blog » మ‌ళ్లీ దొరికిపోయిన ర‌ష్మిక‌…..రౌడీ ఫ్యామిలీతో సెల‌బ్రేష‌న్స్…ఫోటోలు వైర‌ల్..!

మ‌ళ్లీ దొరికిపోయిన ర‌ష్మిక‌…..రౌడీ ఫ్యామిలీతో సెల‌బ్రేష‌న్స్…ఫోటోలు వైర‌ల్..!

by AJAY
Ads

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న గ‌త కొద్ది రోజులుగా డేటింగ్ లో ఉన్నారంటూ ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక జంట‌గా న‌టించిన గీతా గోవిందం సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర‌వాత వీరి కాంబోలో వ‌చ్చిన డియ‌ర్ కామ్రేడ్ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ రెండు సినిమాల త‌ర‌వాత ఇద్ద‌రూ క్లోజ్ అయ్యార‌ని ప్ర‌స్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ వార్త‌లు వినిపిస్తు్న్నాయి.

Advertisement

Vijay dewarakonda rashmika spotted at mumbai

Vijay dewarakonda rashmika spotted at mumbainkra

ఆ వార్త‌ల‌కు కార‌ణం ర‌ష్మిక ఓ సారీ రౌడీతో క‌లిసి వారింట్లో దిగిన ఫోటో సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డ‌మే. అంతే కాకుండా వీరిద్ద‌రూ క‌లిసి ముంబై లో చెక్క‌ర్లు కొడుతున్న ఓ వీడియో కూడా ఇటీవ‌ల నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టింది. దాంతో ఇద్ద‌రూ డేటింగ్ లో ఉన్నారంటూ అభిమానులు క‌న్ఫామ్ అయ్యారు. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా న్యూయ‌ర్ పార్టీ సైతం ఇద్ద‌రూ గోవాలో జ‌రుపుకున్నారు.

Advertisement

విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూయ‌ర్ పార్టీని ఫ్యామిలి తో క‌లిసి గోవాలో జ‌రుపుక‌న్నాడు. అయితే ఆనంద్ దేవ‌ర‌కొండ ఓ ఫోటో దిగి షేర్ చేయ‌గా ర‌ష్మిక సైతం ఓ ఫోటోను షేర్ చేసింది. ఇక ఇద్ద‌రూ దిగిన ఫోటోల బ్యాక్ గ్రౌండ్ ఒకేవిధంగా ఉంది. దాంతో రౌడీ ఫ్యామిలీతో క‌లిసి ర‌ష్మిక గోవా వెళ్లిన‌ట్టు నెటిజ‌న్లు ప‌ట్టేసుకున్నారు.

Rashmika

Rashmika

ఇక ఇప్పుడు సంక్రాతి సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న కుంటుంబంతో క‌లిసి ఇంట్లో సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఫోటోలో విజ‌య్ మెరూన్ క‌ల‌ర్ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. అయితే తాజాగా మ్య‌చింగ్ దుస్తున్న ర‌ష్మిక కూడా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇక ర‌ష్మిక లోకేష‌న్ చూస్తే విజ‌య్ గార్డెన్ మాదిరిగా క‌నిపిస్తుంది. దాంతో మ‌ళ్లీ రౌడీ ఫ్యామిలీతోనే ర‌ష్మిక సంక్రాంతిని సెల‌బ్రేట్ చేసుకుందంటూ వార్త‌లు వినివిస్తున్నాయి.

Advertisement

You may also like