Home » కన్నడ ఇండస్ట్రీ బ్యాన్.. లోపల జరిగేది వేరంటూ నోరు విప్పిన రష్మికా మందన్న

కన్నడ ఇండస్ట్రీ బ్యాన్.. లోపల జరిగేది వేరంటూ నోరు విప్పిన రష్మికా మందన్న

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెరీర్‌ లో రష్మిక… ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న చర్యలు కన్నడ పరిశ్రమను ఆగ్రహానికి గురి చేస్తున్నాయని వాదన వినిపిస్తోండగా, శాండిల్ వుడ్ ఆమెను బ్యాన్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: పెళ్లయిన స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకుంటారో తెలుసా..?

Advertisement

రష్మిక, సొంత ఇండస్ట్రీ శాండిల్ వుడ్ ను వదిలి టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అప్పటి నుంచి రష్మికపై కన్నడ సినిమా లవర్స్ ఆగ్రహంతో ఉంటున్నారు. ఇటీవల కన్నడ నుంచి కాంతార వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రష్మిక ఒక ఇంటర్వ్యూలో కాంతారపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో కన్నడిగల ఆగ్రహం మరింత పెరిగింది. రష్మికపై బ్యాన్ వేయాలని కన్నడ ప్రేక్షకులు డిమాండ్ చేశారు. శాండిల్ వుడ్ చిత్ర పరిశ్రమ కూడా బ్యాన్ వేసిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన్న స్పందించింది.

Advertisement

తనపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం విధించింది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాను కాంతార సినిమా చూశానని, టీం కు కూడా మెసేజ్ చేశానని చెప్పుకొచ్చింది. అయితే ఆ మెసేజ్ ను తాను బయట పెట్టనని చెప్పింది. అది పూర్తిగా తన వ్యక్తిగతమని, నా పర్సనల్ విషయాలను బయట పెట్టలేనని అంటూ చెప్పుకొచ్చింది. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేనని ఆక్రయించారు రష్మిక. మెసేజ్ లు కూడా బయటకు రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం ప్రజలకు అవసరం లేదన్నారు. వ్యక్తిగతంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రజలకు చెప్పడం నా బాధ్యత అన్నారు రష్మిక.

Also Read: మంచి పాత్ర‌ల‌ను రిజెక్ట్ చేసి న‌ష్ట‌పోయిన 10 మంది న‌టీమ‌ణులు వీళ్లే..ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?

Visitors Are Also Reading