Home » గీతాంజలి క్యారెక్టర్ పై రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్.. అందుకోసమేనా..?

గీతాంజలి క్యారెక్టర్ పై రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్.. అందుకోసమేనా..?

by Anji
Ad

సినీనటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.  ప్రస్తుతం ఈమె వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె రణబీర్ కపూర్  నటించిన యానిమల్  మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక ఈ సినిమాలో గీతాంజలి  పాత్రలో నటించారు.ఈ పాత్ర గురించి తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement

గీతాంజలి పాత్రను మాటల్లో చెప్పలేనని ఈమె తెలియజేశారు. గీతాంజలి పాత్ర గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఆమె కుటుంబాన్ని కలిపి పవర్ ఉన్నటువంటి పాత్ర అని తెలిపారు.ఆమె ఎంతో ప్యూర్, రియల్, అన్‌ఫిల్టర్డ్, స్ట్రాంగ్ అండ్ రా.గీతాంజలి అనే పాత్ర ప్రేమను, ప్రశాంతతను పంచుతుంది.నమ్మకాన్ని కలిగిస్తుంది.భర్త, పిల్లల కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తుంటుంది.ఫ్యామిలీ కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడుతుంది.నా వరకు గీతాంజలి పాత్ర ఎంతో గొప్పది అంటూ ఈ సందర్భంగా ఈమె గీతాంజలి పాత్ర గురించి చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారం అవుతున్నప్పటికీ ఇంకా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కూడా ఈమె తెలియజేశారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి బాలీవుడ్ ఇండస్ట్రీలో  పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయని తెలుస్తుంది.ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా  పనులతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ అని సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు మరికొన్ని సినిమాలకు కూడా ఈమె కమిట్ అయ్యారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading