Home » స్టేజి పైనే.. మాస్ స్టెప్పులతో ఇరగదీసిన రష్మిక

స్టేజి పైనే.. మాస్ స్టెప్పులతో ఇరగదీసిన రష్మిక

by Bunty
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా చేసిన సినిమా పుష్ప. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన… టాలీవుడ్ యంగ్ బ్యూటీ రష్మిక మందన నటించిన సంగతి తెలిసిందే. అలాగే జబర్దస్త్ యాంకర్ అనసూయ, నటుడు సునీల్, ఫాహద్ పజిల్ లాంటి తదితర నటులు ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement

అయితే నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈ సందర్భంగా.. హీరోయిన్ రష్మిక స్టేజ్ పైనే స్టెప్పులేసింది. పుష్ప సినిమా లో పాపులర్ అయిన… సామీ.. సామీ అని అని పాటకు హీరోయిన్ రష్మిక డాన్స్ చేసింది. యాంకర్ సుమ అడగడం తోనే ఒప్పుకున్న రష్మిక.. అందరినీ ఆకట్టుకునేలా స్టెప్పులు వేసింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా డిసెంబర్ 17 వ తేదీన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది.

Visitors Are Also Reading