Home » అంబానీ ఇంట రష్మికకు అవమానం.. ఓ రేంజ్ లో శ్రద్ధాకపూర్ ని ట్రోల్ చేస్తున్న రష్మిక ఫ్యాన్స్.. ఇంతకీ ఏమైందంటే?

అంబానీ ఇంట రష్మికకు అవమానం.. ఓ రేంజ్ లో శ్రద్ధాకపూర్ ని ట్రోల్ చేస్తున్న రష్మిక ఫ్యాన్స్.. ఇంతకీ ఏమైందంటే?

by Srilakshmi Bharathi
Ad

అంబానీ కుటుంబం ఇటీవల ముంబైలోని తమ నివాసం యాంటిలియాలో గణపతి పూజను నిర్వహించింది, దీనికి భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అందరిని ఆహ్వానించింది. ఈ వేడుకకి రష్మికని కూడా ఆహ్వానించారు. ఆమె తెల్లని చీరలో ఈ వేడుక వద్ద మెరిశారు. అయితే.. రశ్మికతో పాటు ఈ ఈవెంట్ కు శ్రద్ధ కపూర్ కూడా వచ్చారు. . ఇద్దరు నటీమణులు ఒకే సమయంలో కనిపించడంతో వారిపై కెమెరాలు ఫోకస్ అయ్యాయి. అయితే.. శ్రద్ధ కపూర్ ను గమనించిన రష్మిక.. ఆమెను పలకరించడం కోసం వెళ్లి ఆగగా.. శ్రద్ధ కపూర్ ఆమెను పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్లిపోయారు.

Advertisement

దీనితో.. శ్రద్ధ కపూర్ ఇలా కావాలనే చేసారని.. రశ్మికను అవమానించారని రష్మిక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై అందరినీ ఆకట్టుకుంది. పలువురు నెటిజన్లు వీడియో కామెంట్స్ విభాగంలో తమ స్పందనలను తెలిపారు. ఓ నెటిజెన్.. వీరిద్దరూ ఎదురు పడ్డా కనీసం ఓ చిరునవ్వతో కూడా పలకరించుకోలేదా? అంటూ ప్రశ్నించారు. మరొకరు బాలీవుడ్ నటులకు దక్షిణాది నటులంటే చిన్న చూపు ఉందని.. అందుకే శ్రద్ధ కపూర్ రశ్మికను కనీసం పలకరించలేదని కామెంట్స్ చేసారు.

Advertisement

మరో వైపు.. కొందరు శ్రద్ధ కపూర్ నిజంగానే చూసి ఉండకపోవచ్చని పాజిటివ్ కామెంట్స్ చేసారు. మరి కొందరు ‘శ్రద్ధా రష్మికను పట్టించుకోని తీరు…అదే నెపోటిజం’ అంటూ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. , అంబానీ గణపతి పూజకు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, అజయ్ దేవగన్, కరణ్ జోహార్, రోహిత్ శెట్టి మరియు చాలా మంది ఇతర సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. సచిన్ టెండూల్కర్, KL రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వంటి క్రీడా ప్రముఖులు కూడా హాజరు అయ్యారు.

ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు..MP గా పోటీ చేస్తారా ?

విజయ్ ఆంటోనీ తన కూతురుతో చివరగా మాట్లాడిన మాటలు ఇవే.. ఏమన్నారంటే?

Trisha : పెళ్లైన నిర్మాతతో హీరోయిన్ త్రిష వివాహం..?

Visitors Are Also Reading