Home » చ‌ర‌ణ్ కు జోడీగా ర‌ష్మిక‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌..!

చ‌ర‌ణ్ కు జోడీగా ర‌ష్మిక‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌..!

by AJAY
Published: Last Updated on
Ad

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తు ప్రేక్ష‌కుల‌ను అరిస్తోంది. ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అందానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఆ త‌ర‌వాత ర‌ష్మిక ప‌లువురు స్టార్ హీరోల సినిమాల‌లో న‌టించి మెప్పించింది. ఇక రీసెంట్ గా ఈ అమ్మ‌డు పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకుంది. అయితే తాజాగా ర‌ష్మిక‌కు రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న సినిమాలో ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

Advertisement

రామ్ చ‌ర‌ణ్ జెర్సీ సినిమా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొద‌ట దిశాప‌టాని నటించే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ర‌ష్మిక‌ను ఫైన‌ల్ చేశారు. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌కట‌న కూడా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ర‌ష్మిక పుష్ప పార్ట్ 2 లో న‌టిస్తోంది.

Visitors Are Also Reading