Home » విజయ్ పెళ్లిలో రష్మిక డ్యాన్స్..అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

విజయ్ పెళ్లిలో రష్మిక డ్యాన్స్..అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

పరుశురామ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఫ్యామిలీ స్టార్. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ్యామిలీ స్టార్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘ఐరనే వంచాలా ఏంటి‘ అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది.

Advertisement

Advertisement

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘కళ్యాణి వచ్చా వచ్చా’ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. పెళ్ళికి సంబంధించిన ఈ పాటలో మృణాల్, విజయ్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. సాంగ్ లోని విజువల్స్, కొరియోగ్రఫీ పాటకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈ పాటకు గోపి సుందర్ సంగీతం అందించగా.. మంగ్లీ, కార్తిక్ ఆలపించారు. విడుదలైన క్షణాల్లోనే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇదిలా ఉంటే.. ‘కళ్యాణి’ వచ్చా వచ్చా’ ఫుల్ సాంగ్ లో రష్మిక ఉండబోతున్నట్లు న్యూస్ వైరలవుతోంది. సినిమాలో విజయ్, మృణాల్ పెళ్ళికి సంబంధించిన ఈ పాటలో రష్మిక స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Also Read :   ప్రభాస్ రాజా సాబ్ నుంచి క్రేజీ అప్డేట్.. రిలీజ్ అప్పుడే..?

Visitors Are Also Reading