Home » సుధీర్‌కు వార్నింగ్ ఇచ్చిన ర‌ష్మీ.. ఎందుకో తెలుసా..?

సుధీర్‌కు వార్నింగ్ ఇచ్చిన ర‌ష్మీ.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

తెలుగు బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు ర‌ష్మీ, సుధీర్ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వీరిద్ద‌రికీ యూత్ విప‌రీత‌మైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉన్న‌ది. వీరిద్ద‌రూ రియ‌ల్ లైఫ్‌లో క‌లిసిపోతే చూడాలి అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ షోలో అలాగే డీ షోలో వీరి మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీ ఇప్ప‌టికీ ఎన్నోసార్లు చూశాం. ఈజోడిని స్టేజ్‌పై ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్ట‌దు. వీరిద్ద‌రిపై బుల్లితెర‌పై ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల ఈవెంట్ల‌ను చేసారు.

 

సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ.. హద్దుల్లో ఉండంటూ

Advertisement

ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల ఓ ప్రోగ్రాంలో ర‌ష్మి సుడిగాలి సుధీర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నేను లేన‌ప్పుడు చేసింది చాలు. నీ హ‌ద్దుల్లో మ‌ర్యాద‌గా ఉండు అంటూ ర‌ష్మి, సుధీర్‌కు గ‌ట్టిగానే ఇచ్చింది వార్నింగ్. అయితే ఇటీవ‌ల జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ నుండి ర‌ష్మి గౌత‌మ్ , సుడిగాలి సుధీర్ త‌ప్పుకున్నారు అంటూ వార్త‌లు వినిపించాయి. ఈ త‌రుణంలో ఆ వార్త‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే జ‌బ‌ర్ద‌స్త్‌తో పాటు ఇత‌ర టీవీ చాన‌ల్స్‌లో కూడా వీరిద్ద‌రూ క‌నిపించ‌లేదు.

Advertisement

 

సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ స్ట్రాంగ్ వార్నింగ్

దీంతో వీరిద్ద‌రి అభిమానులు ఎక్క‌డ అని కామెంట్లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ముఖ్యంగా సుధీర్ అభిమానులు అయితే అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. సుధీర్‌, ర‌ష్మీలకు ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకుని త‌మ రెమ్యున‌రేష‌న్ పెంచాలి అని జ‌బ‌ర్ద‌స్త్ షో నిర్వాహ‌కుల‌ను కోర‌డంతో వారిని ప‌క్క‌న బెట్టారు అని వార్త‌లు వినిపించాయి. ఏమి జ‌రిగింది ఏమో తెలియ‌దు కానీ మ‌ర‌ల తిరిగి ర‌ష్మీ, సుధీర్‌లు జ‌బ‌ర్ద‌స్త్ స్టేజీపైన‌ ఎంట్రీ ఇచ్చారు. వీరు రాగానే ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లో వీరి హంగామా చూపిస్తూ.. జ‌ల‌జ‌ల జ‌ల‌పాతం నువ్వు నీకాళ్ల‌ని ప‌ట్టుకు వ‌ద‌ల‌న‌న్న‌ది అనే పాటల‌కు ఇద్ద‌రు స్టెప్పులు ఇర‌గ‌దీశారు. వారిద్ద‌రి మ‌ధ్య స‌ర‌దాగా సంభాష‌ణ జ‌రిగింది. ర‌ష్మీ సుధీర్‌కు గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక ర‌ష్మీ సుధీర్ మ‌ళ్లీ జంట‌గా స్టేజ్‌పై క‌నిపించ‌డంతో వీరిద్ద‌రి అభిమానులు ఖుషి అవుతున్నారు. మ‌రికొంద‌రూ వీరిద్ద‌రినీ మ‌ళ్లీ ఢీ షోకు తీసుకురావాల‌ని రిక్వేస్ట్ చేస్తున్నారు.

Visitors Are Also Reading