Telugu News » రణ్బీర్ కపూర్ ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికే జక్కన్న కాళ్లకు నమస్కరించారా…?

రణ్బీర్ కపూర్ ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికే జక్కన్న కాళ్లకు నమస్కరించారా…?

by AJAY MADDIBOINA

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం తెలుగు సినిమాలను ముంబైకి వెళ్లి బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ వాళ్లు కూడా మన దగ్గరికి వచ్చి ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రణబీర్ కపూర్ హైదరాబాద్ లో తన బ్రహ్మాస్త్ర సినిమా కు సంబంధించిన ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Ads
Ranbir Kapoor

Ranbir Kapoor

అంతేకాకుండా నిర్మాత కరణ్ జోహార్ బ్రహ్మాస్త్రాలో నటించిన నాగార్జున రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ అలియా భట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రణబీర్ కపూర్ దర్శక ధీరుడు రాజమౌళి పాదాలకు నమస్కారం చేశారు. అక్కడితో ఆగకుండా వెంటనే హీరో నాగార్జున కాళ్ళకు సైతం రణబీర్ కపూర్ నమస్కరించారు. దాంతో రణబీర్ కపూర్ సంస్కారం చూసి అంతా ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ హీరో ఎలాంటి ఈగో లేకుండా టాలీవుడ్ దర్శకుడు, మరియు హీరో నాగార్జున కాళ్లకు నమస్కరించారని అతడి క్యారెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల రణబీర్ కపూర్ అభిమాని ఒకరు ఆయన ఇంటికి వెళ్లి గిఫ్ట్ ఇచ్చి వెంటనే కాళ్లకు నమస్కరించారు.

 

దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ వీడియోలో అభిమాని వచ్చి కాళ్లకు నమస్కారం పెట్టుకుంటే రణబీర్ కపూర్ అతడిని ఆపలేదు. దాంతో రణబీర్ కపూర్ పై విమర్శలు వచ్చాయి. రణబీర్ కపూర్ కు చాలా ఆటిట్యూడ్ అంటూ ఫైర్ అయ్యారు. అయితే తాజాగా నాగార్జున, రాజమౌళి పాదాలకు నమస్కరించిన రణబీర్ పెద్దవాళ్ల కాళ్ళకి నమస్కారం లో ఎలాంటి తప్పులేదు అని చెప్పకనే చెప్పారు. మరోవైపు రణబీర్ కపూర్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే జక్కన్న, నాగ్ ల పాదాలకు నమస్కరించాడు అని కొంతమంది అంటున్నారు.


You may also like