తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామానాయుడు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్ హీరోలుగా ఎదిగారు వెంకటేష్ మరియు రానా.. ఇందులో వెంకటేష్ ఇప్పటికీ స్టార్ గానే కొనసాగుతున్నారు.. వెంకటేష్ అన్న కొడుకు రానా మాత్రం పలు సినిమాల్లో నటించి ఇప్పటికే మంచి గుర్తింపు సాధించాడు.. కానీ ఈ మధ్యకాలంలో రానా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ అవి ఏంటయ్యా అంటే.. ఆయన త్వరలో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Also Read;ఏఎన్ఆర్ చివరి రోజుల్లో అందర్నీ దూరం పెట్టడానికి కారణం..?
దగ్గుబాటి రానా లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించాడు. ఆ తర్వాత తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ వస్తున్నారు. అలాంటి రానా జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా బాహుబలి. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో రానా భల్లాల దేవుడిగా అద్భుతంగా నటించాడు. సినీ కెరియర్ పర్వాలేదు అనుకున్న సమయంలోనే 2021లో అరణ్య సినిమాలో నటించాడు.
Advertisement
కానీ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీని తర్వాత భారీ అంచనాల నడుమ విరాటపర్వం మూవీ వచ్చింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ విధంగా ఫ్లాపులతో సతమతమవుతున్న రానా గురించి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు,ఆయన సినిమాలు చేయనని భావిస్తున్నారట. దీనికి ప్రధాన కారణం ఆయన చేసిన సినిమాలు హిట్ కాకపోవడం, మరో ముఖ్య కారణం రానాకు కిడ్నీకి సంబంధించిన సమస్య ఏర్పడిందట. ఈ కిడ్నీ చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లి చాలా రోజులున్న విషయం మనందరికీ తెలిసిందే. తన ఆరోగ్య పరిస్థితిల దృష్ట్యా ఇక సినిమాలకు దూరంగా ఉండాలని భావించారట.