Home » సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. షూటింగ్ లో ఏడుపు.. వదలని దర్శకుడు..!!

సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. షూటింగ్ లో ఏడుపు.. వదలని దర్శకుడు..!!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రమ్యకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికీ ఐదు పదుల వద్ద వయస్సు దాటినా తరగని అందంతో సినిమాల్లో నటిస్తూ వస్తోంది. అంతటి అందచందాలు కలిగిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది.

Advertisement

అలాంటి రమ్యకృష్ణ తెలుగు, తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో చాలా సినిమాల్లో నటించింది. కానీ రమ్యకృష్ణకు అత్యంత పేరు తీసుకువచ్చిన సినిమా మాత్రం నరసింహ అని చెప్పవచ్చు. కానీ నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నటించిన పాత్ర ఆమెకి ఇండస్ట్రీలోనే గొప్ప పేరు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాకు ఈమె మెయిన్ పిల్లర్ గా నిలిచిందని చెప్పవచ్చు. అయితే రమ్యకృష్ణ ఈ పాత్ర చేయడం వెనుక చాలా పెద్ద కథ నడిచింది . అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్రకు మీనా అనుకున్నారట.

also read:బాలయ్య ఎంత క‌ట్నం తీసుకున్నారు? వ‌సుంధ‌ర ఎవ‌రి కూతురు?

Advertisement

కానీ ఆమె అగ్రెసివ్ లుక్కులో అంతగా నటించలేకపోవడంతో దర్శకుడు రవికుమార్ ఆమెను వద్దన్నాడు. ఆ తర్వాత నటి నగ్మా అనుకున్నారు. కానీ ఆమె షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇక చివరికి ఆ పాత్ర రమ్యకృష్ణ వద్దకు వచ్చింది. నీలాంబరి పాత్ర గురించి ముందుగా రమ్యకృష్ణకు ఆమె వద్దని చెప్పిందట. నేను సౌందర్య ముఖంపై కాలు పెట్టడం నాకు నచ్చలేదు అంటూ చేయను అంటూ మొఖం చాటేసిందట. కానీ దర్శకుడు రవికుమార్ మరియు సౌందర్య కలిసి బలవంతం చేసి ఆ పాత్రకు రమ్యకృష్ణ ను ఒప్పించారని ఒక సందర్భంలో రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.

దీంతో నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రను రమ్యకృష్ణ రజినీకాంత్ కు ఏ మాత్రం తీసిపోకుండా నటించింది. సౌందర్య ను కాలితో తన్నే సమయంలో రమ్యకృష్ణ ఒక్కసారిగా ఏడ్చేసిందట.. కానీ దర్శకుడు మరియు సౌందర్య ఎంకరేజ్ చేయడంతో ఆ పాత్ర చాలా బాగా పండింది. ఈ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.. ఎలాగంటే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్ర లో ఏ విధంగా అందరినీ ఆకట్టుకుందో, ఆ విధంగానే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్ర కూడా అంతగా పండిందంటే ఆ సమయంలో ఆమెకి ఎంత పేరు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా నరసింహ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయిందని సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు.

also read:

Visitors Are Also Reading