Home » Ramoji Rao: రామోజీ రావు పరిచయం చేసిన హీరోలు వీరే…!

Ramoji Rao: రామోజీ రావు పరిచయం చేసిన హీరోలు వీరే…!

by Sravanthi
Ad

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు చనిపోయారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేశారు. తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉందని అన్నారు. రెండు రోజులుగా తీవ్ర స్వస్థత గురవుతున్న ఆయన వెంట చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు రామోజీ ఫిలిం సిటీ లోని నివాసానికి పార్దివదేహం తరలించారు. రామోజీరావు ఎంతోమంది హీరోలని పరిచయం చేశారు. రామోజీరావు పరిచయం చేసిన హీరోల గురించి ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఉదయ్ కిరణ్ మొదలు ఎన్టీఆర్ దాకా కొంతమంది హీరోలను ఆయన పరిచయం చేశారు. ఉషా కిరణ్ మూవీస్ కింద 30 వరకు సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించిన సినిమాల్లో శ్రీవారి ప్రేమలేఖ మొదటిది. 1984లో ఈ మూవీ వచ్చింది. రామోజీరావు చాలామంది హీరోలను పరిచయం చేశారు. ఉదయ్ కిరణ్ ని పరిచయం చేస్తూ చిత్రం అనే మూవీ నుండి నిర్మించారు. సూపర్ హిట్ అయింది. తరుణ్ ని పరిచయం చేస్తూ నువ్వే కావాలి సినిమాను నిర్మించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయింది.

Advertisement

Also read:

అలాగే దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాను కూడా రామోజీరావే నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ మొదటి హీరోగా నటించిన నిన్ను చూడాలని సినిమాను కూడా ఉషా కిరణ్ మూవీస్ నిర్మించింది. తనీష్ ను కూడా పరిచయం చేశారు. ఆయన ఆఖరిగా నిర్మించిన సినిమా దాగుడుమూత దండాకోర్. రామోజీ గ్రూప్లో ఈనాడు మీడియా మార్గదర్శి చిట్ ఫండ్స్ తో పాటుగా ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి, బ్రీజా షోరూమ్స్ వంటి సంస్థలు ఉన్నాయి ఇలా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించిన రామోజీరావు వ్యాపారంలో ముందుకెళ్లారు. 1974 ఆగస్టు 10న విశాఖ వేదికగా ఈనాడు పత్రికని ప్రారంభించారు. ఈటీవీ పేరుతో ఎనిమిది భాషల్లో చానల్స్ ని కూడా తీసుకొచ్చారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading