Ad
పాకిస్థాన్ ఎప్పుడు ఇండియా బేటా.. ఇండియా లేకపోతే పాకిస్థాన్ లేదు అనే మాటలు చాలానే విని ఉంటారు. కానీ ఈ విషయాన్ని మాత్రం పాకిస్థాన్ ఒప్పుకోదు. అయితే ఇప్పుడు ఇండియా లేకపోతే మేము లేము అని పాకిస్థాన్ గుర్తించింది. ఇండియాకు వ్యతిరేకం కావడం మంచిది కాదు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రమీజ్ రామ కామెంట్స్ చేసాడు.
అయితే ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరిగే ఆసియా కప్.. ఇండియా లో జరిగే ప్రపంచ కప్ పైనే చర్చ అనేది జరుగుతుంది. పాకిస్థాన్ లోనే ఆసియా కప్ జరిగితే మేము రాము అని ఇండియా ఖరాకండిగా చెప్పింది. అయితే ఈరోజు మేము కూడా ఇండియాలో జరిగే టోర్నీలకు రాము అని చెప్పిన పాకిస్థాన్ అప్పుడే మాట అనేది మార్చింది.
తాజాగా పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ రమీజ్ రాజా అక్కడ మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్ బోర్డు అనేది 50 శాతం ఐసీసీ నుండి వచ్చే ఫండింగ్ పైనే ఆధాపడి ఉంది. కానీ అదే ఐసీసీకి 90 శాతం ఫండింగ్ అనేది భారత్ నుండి వస్తుంది. అంటే మనం ఇండియా ఫండింగ్ పైనే ఆధారపడి ఉన్నాము. ఒకవేళ భవిష్యత్ లో మా ఫండింగ్ అనేది పాకిస్థాన్ కు వెళ్ళకూడదు అని ఇండియా నిర్ణయించుకుంటే పరిస్థితి ఏంటి.. మన బోర్డు కుప్పకుపోతుంది అని రమీజ్ రాజా పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
కోహ్లీ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన కోచ్..!
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు వరుణుడు హాజరు..?
Advertisement