Ad
పాకిస్థాన్ క్రికెట్ లో ఎప్పుడు ఏదో ఒక్క వివాదం అనేది ఉంటూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ముగ్గురు ప్లేయర్స్ వల్ల నడుస్తుంది. అందులో ఒక్కడు అద్భుతమైన పేసర్ అయిన షాహిన్ షా ఆఫ్రిది అనే విషయం అందరికి తెలిసిందే. కానీ తాజాగా జరిగిన ఆసియా కప్ కంటే ముందు శ్రీలంకతో ఆడిన టెస్ట్ సిరీస్ ఓ షాహిన్ గాయపడటంతో.. అతను ఆసియా కప్ లో ఆడలేదు.
అయినా కూడా పాక్ జట్టుతోనే ఉన్న షాహిన్ షా తాజాగా చికిత్స కోసం లండన్ కు వెళ్ళాడు. కానీ షాహిన్ షా చికిత్స కోసం పాక్ బోర్డు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని అతని ప్రియని తండ్రి.. మాజీ క్రికెటర్ షాహిద్ ఆఅఫ్రిదీ అన్నాడు. షాహిన్ షా లండన్ కు తన సొంత డబ్బుతో.. వెళ్ళడము అక్కడ చికిత్స కూడా తన డబ్బుతోనే తీసుకుంటున్నాడు అని పేర్కొన్నాడు.
కానీ షాహిద్ ఆఫ్రిది చేసిన ఈ కామెంట్స్ ను పాకిస్థాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా తప్పవు బట్టాడు. మీరు అసలు అలా ఎలా కామెంట్స్ చేస్తారు అని పేర్కొన్నాడు. అదే విధంగా షాహిన్ షా చికిత్స కోసం అయ్యే మొత్తం ఖర్చు పాక్ బోర్డు భరిస్తుంది అని.. మేము అతడిని ఎప్పుడు వదిలేయలేదు అని పేర్కొన్నాడు. ఒకవేళ అతని హోటల్ విషయంలో ఏదైనా సమస్యలు ఉంటె ఉండవచ్చు అని చెప్పాడు.
ఇవి కూడా చదవండి :
మిస్సింగ్ యూ అంటూ విరాట్ కోహ్లీపై అనుష్క ఎమోషనల్ పోస్ట్..!
కోహ్లీ మా మూడో ఓపెనర్..!
Advertisement