Home » రాజ‌మండ్రిలో రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్…!

రాజ‌మండ్రిలో రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్…!

by AJAY
Ad

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండ‌గానే రామ్ చ‌ర‌ణ్ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ తాజాగా రాజ‌మండ్రిలో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ కియారా అద్వాని మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement

ramcharan

ramcharan

పూణే షెడ్యూల్ త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ కొంత కాలం షూటింగ్ ల‌కు బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా సినిమాలో శ్రీకాంత్, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మ‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇక ఈ సినిమాను వ‌చ్చే యేడాది సంక్రాంతికి విడుద‌ల చేయనున్నారు.

Advertisement

Visitors Are Also Reading