Home » చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…రంగస్థలం కాంబో రిపీట్..?

చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…రంగస్థలం కాంబో రిపీట్..?

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమా కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లో పుష్ప పార్ట్-2 సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ సుకుమార్ బిజీ అవ్వనున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ తన రాబోయే ప్రాజెక్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్ప పార్ట్ -2 షూటింగ్ పూర్తి చేసుకున్న తరవాత విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపాడు.

Advertisement

Ram Charan sukumar

Ram Charan sukumar

ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సుకుమార్ తాజాగా తన మరో సినిమాపై కూడా ప్రకటన చేశారు. రామ్ చరణ్ హీరోగా మరో సినిమా అనుకుంటున్నట్టు సుకుమార్ చెప్పారు. అయితే చరణ్ తో సినిమా ఇంకా కన్ఫార్మ్ అవ్వలేదు అని తెలిపారు. దీనిని బట్టి చూస్తే చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సుకుమార్ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు కనిపిస్తోంది.

Advertisement

 

ఇక ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ తో రంగస్థలం లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రామ్ చరణ్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ తనలోని నటుణ్ణి మాత్రం రంగస్థలం సినిమాతోనే ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త గా కనిపించారు. కాబట్టి సుకుమార్ కు చరణ్ ఖచ్చితంగా మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందా లేదా అన్నది చూడాలి.

Visitors Are Also Reading