Home » ఉక్రెయిన్ బాడీ గార్డుకు అండగా రామ్ చ‌ర‌ణ్…ఏం చేశాడంటే..!

ఉక్రెయిన్ బాడీ గార్డుకు అండగా రామ్ చ‌ర‌ణ్…ఏం చేశాడంటే..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చ‌ర‌ణ్. మొద‌టి సినిమా చిరుత తోనే రామ్ చ‌ర‌ణ్ అభిమానులను సంపాదించుకున్నారు. ఆ త‌ర‌వాత మ‌గ‌ధీర సినిమాతో ఇండ‌స్ట్రీలో చ‌ర‌ణ్ స్టార్ హీరోగా ఎదిగారు. అంతే కాకుండా రంగ‌స్థ‌లం సినిమాతో చ‌ర‌ణ్ త‌న‌లోని న‌ట‌నా ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌పెట్టారు. ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి. ఇదిలా ఉండ‌గా రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా న‌టించారు.

Advertisement

ఈ చిత్రానికి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఈనెల 25న విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాల‌ను ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ లో చిత్రీక‌రించారు. అయితే ఉక్రెయిన్ లో ఉన్నంత కాలం రామ్ చ‌ర‌ణ్ కు బాడీ గార్డుగా అక్క‌డి వ్య‌క్తి ర‌స్టీ వ్య‌వ‌హ‌రించాడు. ఎక్క‌డ‌కు వెళ్లినా ర‌స్టీ చ‌ర‌ణ్ కు బాడీగార్డుగా ఉన్నారు. ఆయ‌న వెంట‌నే ఉంటూ ఎంత‌గానో స‌హాయ‌ప‌డ్డాడు.

Advertisement

rrr-movie-reviewఇక ఇప్పుడు ఉక్రెయిన్ ర‌ష్యా మ‌ధ్య యుద్దం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. యుద్దం నేప‌థ్యంలో అక్క‌డ ప్ర‌జ‌లు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. బ‌య‌ట‌కు రాలేక ప‌నులు చేసుకోలేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక యుద్దం విష‌యం తెలిసిన రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు బాడీగార్డుగా చేసిన ర‌స్టీని ఫోన్ ద్వారా సంప్ర‌దించారు.

RRR FIRST RIVEW

ప్ర‌స్తుతం ఆయన కుటుంబ ప‌రిస్థితిని గురించి అడిగితెలుసుకున్నారు. అంతే కాకుండా ర‌స్టీకి రామ్ చ‌ర‌ణ్ ఆర్థిక‌సాయం అందించారు. ఇక చ‌ర‌ణ్ పంపించిన డ‌బ్బుతో ర‌స్టీ స‌రుకులు కొనుకున్నారు. అంతే కాకుండా చ‌ర‌ణ్ చేసిన సాయం గురించి చెబుతూ ర‌స్టీ వీడియోను షేర్ చేయ‌గా అది వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading