పరిచయం :
మాస్ మహారాజ రవితేజకు క్రాక్ తర్వాత మళ్లీ సరైన హిట్ పడలేదు. కాగా తాజాగా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శరత్ మండవ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్…రజియా విజయన్ లు హీరోయిన్ లుగా నటించారు.
Advertisement
ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు కూడా ముఖ్యపాత్రలో నటిస్తూ రియంట్ ఇచ్చాడు యదార్ధ సంఘటన ఆధారంగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా మాస్ మహారాజ్ కు మరో హిట్ ఇచ్చిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం…
Advertisement
Rama rao on Duty Review కథ :
సినిమాలో రవితేజ సబ్ కలెక్టర్ పాత్రలో కనిపించాడు. కొన్ని కారణాలవల్ల రవితేజ సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత చిత్తూరులోని ఓ మండలంలో రెవెన్యూ అధికారిగా నియమించబడతాడు. అక్కడ కొంతమంది అనుమానాస్పదంగా మిస్ అవుతూ ఉంటారు. దానిపై రవితేజ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. కాగా గంధపు చెక్కల స్మగ్లింగ్ కారణంగానే హత్యలు జరిగినట్టు రవితేజ గుర్తిస్తాడు. ఆ తర్వాత రవితేజ ఏం చేశాడు….? ఎలా గంధపు చెక్కల స్మగ్లింగ్ ను అరికట్టగలిగాడు అసలు ఊర్లో కనిపించకుండా పోతున్న వారిని హత మారుస్తుంది ఎవరు అన్నదే ఈ సినిమా కథ. సినిమా ప్రారంభం నుండే ట్విస్ట్ లు మొదలవుతాయి. రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో ఒదిగిపోయాడు. మాస్ డైలాగులు కొడుతూ రవితేజ చూపించే యాక్షన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో రవితేజ గెటప్… అతడు చేసే యాక్షన్ అద్భుతంగా కనిపిస్తాయి. సినిమాలో పాటలు యావరేజ్ గా ఉన్నప్పటికీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. హీరోయిన్ల పర్ఫామెన్స్ కూడా చాలా బాగుంది. దర్శకుడు శరత్ మండవకు ఈ సినిమాతో హిట్ పడినట్టే. సినిమాలో తొట్టెంపూడి వేణు ఎస్ఐ పాత్రతో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా సినిమా క్లైమాక్స్ మాత్రం బ్యాంగ్ అనే చెప్పాలి.
సినిమాలో ప్లస్ లు & మైనస్ లు :
సినిమాలో రవితేజ నటన డైలాగ్ డెలివరీ ప్లస్ అయ్యింది.
ఎస్ఐ పాత్రకు తొట్టెంపూడి వేణు సరైన న్యాయం చేసి ఆకట్టుకున్నాడు.
సినిమాలో యాక్షన్ సీన్లు ట్విస్టులు చాలా బాగున్నాయి.
ఈ చిత్రంలో పాటలు మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచాయి.
Also Read: మాస్ మహారాజా రవితేజ మెగాస్టార్ చిరంజీవి సవతి తల్లి కొడుకా..? ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..!