Home » ఫారెన్ ట్రిప్ లో ఫుల్ ఎంజాయ్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. వీడియో వైరల్..!

ఫారెన్ ట్రిప్ లో ఫుల్ ఎంజాయ్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. వీడియో వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు టాంజానియాలో పుల్ ఎంజాయ్ చేశారు. అక్కడి అందాలను ఆస్వాదించారు. కొన్నాళ్లు సినిమాల టెన్షన్లకు దూరంగా ప్రకృతి అందాలను ఆస్వాదించిన వారు ఇండియాకు చేరారు మెగా జంట. రీసెంట్ గా  ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా ఓవారం పాటు జపాన్ లో సందడి చేసిన రామ్ చరణ్ అక్కడ పర్యటన ముగించుకుని డైరెక్ట్ గా టాంజినియా ఫ్లైట్ ఎక్కారు.  ఓ ఉద్యాన వనంలో జంతువులను చూసుకుంటూ.. ప్రకృతి ఒడిలో సేద తీరారు ఈ దంపతులు.

Advertisement

ఇక టాంజినియాలో రామ్ చరణ్ రైడ్ చేశాడు . ఓపెన్ టాప్ ను రామ్ చరణ్ నడుపుతుంటే.. పక్కనే ఓ చిన్నారి కూర్చున్నాడు. అక్కడ టూర్ లో భాగంగా ఓపెన్ ప్లేస్ లో ఏర్పాటు చేసిన కిచెన్ లో స్టౌపై చరణ్ ఆమ్లెట్ వేశాడు. ఇదంతా టాంజానియా సఫారీలో భాగమని తెలుస్తోంది. రామ్ చరణ్ కు సాయంగా కొందరు స్థానికులు కూడా వెంట ఉన్నారు. టూర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు చరణ్ దంపతులు.

Also Read :   సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అల్లు అర్జున్ భార్య..!

రామ్ చరణ్, ఉపాసన ఆఫ్రికా దేశాల పర్యటనలో గట్టిగా ఎంజాయ్ చేసి కొన్ని రోజులుగా వీరు అక్కడి పలు ప్రాంతాలను సందర్శిస్తూ మరపురాని జ్ఞాపకాలను పోగేసుకుంటున్నారు. సింహాలను దగ్గరుండి రామ్ చరణ్ ఫోటోలు తీస్తున్న వీడియోను ఆయనే స్వయంగా కొన్ని రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడం తెలిసిందే. తమ రొమాంటిక్ టూర్ కు సంబంధించిన దృశ్యాలతో కూడిన షార్ట్ వీడియోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఉపాసన పోస్ట్ చేశారు. ఇందులో ఎక్కువ సింహాలు కనిపిస్తున్నాయి. అలాగే రామ్ చరణ్, ఉపాసన నేలపై సేద తీరడం, ఓ చెట్టు దగ్గరకు చేరి ఫోటోలు తీసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. గత నెల 20న జపాన్ వెళ్లిన ఈ జంట అటు నుంచి అటే ఆఫ్రికాకు వెళ్లి అక్కడి అందాలను చూస్తూ మైమరిచిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Also Read :   ఆ హీరో, హీరోయిన్ గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వింటే ఆశ్యర్యపోతారు..!

Visitors Are Also Reading