Telugu News » Blog » ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న రామ్ చరణ్..!

ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న రామ్ చరణ్..!

by AJAY
Ads

కొద్దిరోజులు ఉరుకులు పరుగుల జీవితంతో బిజీగా గడిపిన తరవాత ఎవరైనా సరే కాస్త విరామం కోరుకుంటారు. సెలబ్రిటీలు కూడా బిజీ షెడ్యూల్ తర్వాత కాస్త విరామం తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ తారలు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత విహారయాత్రలకు వెళుతుంటారు. కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి టూర్ లకు వెళితే మరి కొందరు స్నేహితులతో కలిసి వెళుతుంటారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే పని చేస్తున్నట్టు కనిపిస్తుంది.

Advertisement

Ramcharan sreeja kalyan

Ramcharan sreeja kalyan

ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమా షూటింగ్ల తర్వాత చరణ్ ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకున్నారు. దాంతో ఆయన స్విజ్జర్లాండ్ కు విహార యాత్రకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చరణ్ స్విట్జర్లాండ్ లో మంచుకొండల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక రామ్ చరణ్ తో పాటు ఆయన సోదరి శ్రీజ కళ్యాణ్ కూడా స్విజర్లాండ్ వెళ్లినట్టు కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

Ram charan

Ram charan

అయితే చరణ్ కాస్త ఆలస్యంగా విహారయాత్రకు వెళ్లగా… ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే కుటుంబంతో కలిసి టూర్ కు వెళ్లారు. కొద్దిరోజులు ఫ్యామిలీతో ప్యారిస్ లో ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం మళ్లీ షూటింగ్ లతో బిజీ అయిపోయారు. ఇక ఇప్పుడు చరణ్ కూడా టూర్ కు వెళ్లి ఎన్టీఆర్ ను ఫాలో అయినట్లు కనిపిస్తోంది. అంతే కాదు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లు షురూ అయితే గ్యాప్ కూడా దొరకదు. అందుకే అప్పుడు ఎన్టీఆర్ పారిస్ వెళ్ళగా ఇప్పుడు చరణ్ స్విజ్జర్లాండ్ లో షికార్లు కొడుతున్నాడు.

 

మహేష్ సోదరినే కాదు..ఆ యంగ్ హీరోను కూడా మూడు కోట్లు ముంచిన శిల్పా చౌదరి..!