గతంలో డీలా పడిన హీరో రామ్ పోతినేని కెరియర్ అనేది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ పైకి లేచింది. కానీ దానిని రామ్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ సినిమా తర్వాత రెడ్ సినిమా రామ్ విడుదల చేయగా అది యావరేజ్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో ది వారియర్ అనే సినిమాను చేసారు రామ్. అది కూడా తాజాగా విడుదల అయ్యి బోల్తా కొట్టింది.
Advertisement
తెలుగు, తమిళ్ రెండు భాషలో విడుదలైన ఈ సినిమా ఎక్కడ కూడా మెప్పించలేకపోయింది. కానీ ఈ సినిమా షూటింగ్ అనేది జరుగుతున్న సమయంలోనే రామ్ తన తర్వాతి సినిమా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అని అనౌన్స్ చేసాడు. ఇక ఈ మధ్యే బోయపాటి బాలయ్యతో అఖండ అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. అందుకే రామ్ తో చేసే సినిమాపై కూడా అంచనాలు అనేవి ఉన్నాయి.
Advertisement
అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ అనేది తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో మన తెలుగులో విడుదల అయ్యే ఎక్కువ శాతం సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తుండటంతో.. రామ్, బోయపాటి సినిమాను కూడా అలాగే ఇండియా వైడ్ గా విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ అనేది భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ప్రయత్నం అనేది సఫలం అవుతుందా.. లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :