Home » రాకేష్ మాస్టర్ కి శేఖర్ మాస్టర్ అంటే అంత ప్రేమనా ?

రాకేష్ మాస్టర్ కి శేఖర్ మాస్టర్ అంటే అంత ప్రేమనా ?

by Anji
Ad

తెలుగు చలనచిత్ర నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ ఆదివారం రోజు తిరుగు రాని లోకాలకు వెళ్లిన విషయము తెలిసిందే. సోమవారం సాయంత్రం బోరబండ లోని స్మశాన వాటికలో రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు జరిగాయి. రాకేష్ మాస్టర్ అంత్యక్రియలకు ఆయన శిష్యుడు శేఖర్ మాస్టర్ రాడు అని అందరూ భావించారు. కానీ శేఖర్ మాస్టర్ తన గురువు చివరి చూపు కోసం వచ్చారు.  దగ్గర ఉండి మరి అంతిమ సంస్కారాలను జరిపించారు.

Advertisement

ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ తాను రాకేష్ మాస్టర్ యొక్క ప్రియ శిష్యుడు అని నిరూపించుకున్నారు. వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు జారిగాయి అనే విషయాన్ని అలా పక్కకు పెడితే.. రాకేష్ మాస్టర్ కు శేఖర్ మాస్టర్ అంటే ఎంతో ప్రేమ.. తనకు ఎంతమంది శిష్యులు ఉన్నా శేఖర్ ను ప్రత్యేకంగా చూసేవారట రాకేష్ మాస్టర్. విషయాలను స్వయంగా రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. “నా తర్వాత నువ్వే రా డాన్సులు వారసుడివని శేఖర్ తో చాలా సందర్భాల్లో చెప్పేవాడిని. షూటింగ్లో ఎప్పుడైనా శేఖర్ పక్కకు పెట్టి ఆ ప్లేస్లో వస్తే ఇమ్మీడియేట్ గా ఫైర్ అయిపోతాను.

Advertisement

 

ఎవడ్రా నువ్వు.. బోసు*కే అని శేఖర్ ని ఫ్రంట్ లైన్ లో నిల్చోపెట్టేవాడిని. వేణు తొట్టెంపూడి నటించిన చిరునవ్వుతో సినిమా షూటింగు అప్పుడు శేఖర్ ను వెనక్కి పంపించారు. నేను వేణు సార్ ని అడిగి ముందుకు రప్పించాను. నేను కెమెరా లో కనిపించాలి శేఖర్ ను డామినేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎడిటర్లకు కూడా అదే చెప్పేవాడిని. శేఖర్ మూమెంట్ ఏ కరెక్ట్ అని చెప్పేవాడిని. నేను శేఖర్ ను బక్క అని పిలిచేవాడిని. ఓకే థాంక్స్ వేసుకునే వాళ్ళం. అన్ని చూసి ఒక్కోసారి ఏడుస్తాను. వాడు నా తమ్ముడు.. నా కొడుకు.. శేఖరే నేను” అని  చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సుధాకర్ కొడుక్కి అండగా చిరంజీవి.. స్నేహితుడి కోసమే..!

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Visitors Are Also Reading