ప్రేమను కాదనడానికి కారణం ఉండదు ప్రేమ మత్తులో అమ్మా నాన్న ఇటువంటివి కూడా కనపడవు. అన్ని అనుకున్నట్లే జరిగితే ప్రేమ కథ హ్యాపీగా ముగుస్తుంది. కానీ ప్రేమ మైకానికి మోసం తోడైతే జీవితం చాలా దారుణంగా మారిపోతుంది. ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథలో దీన్ని మనం చూడవచ్చు.
సినిమా: రాజు యాదవ్
నటులు: గెటప్ శ్రీను,అంఖితా కారట్,ఆనంద చక్రపాణి తదితరులు
దర్శకుడు: కృష్ణమాచారి కె
రిలీజ్ డేట్: 24-05-2024
Advertisement
కథ మరియు వివరణ:
ఇక కథ విషయానికి వస్తే.. రాజు (గెటప్ శ్రీను) డిగ్రీ ఫెయిలవుతాడు. ఊర్లో తిరుగుతూ ఉంటాడు. ఒక మధ్య తరగతి యువకుడు. ఒకరోజు క్రికెట్ ఆడుతూ ఉంటే కార్కు బాల్ మొఖానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గర్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. అతను తెలిసి తెలియని వైద్యం చేసి మొహానికి కుట్లు వేస్తాడు. దీంతో రాజు మొఖం ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్లే మారుతుంది. ఆ కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటాడు, అతని ముఖాన్ని చూసి అందరూ హేళన చూస్తారు ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి స్వీటీ (అంకిత కరాట్) ను చూసి ప్రేమలో పడతాడు. అప్పటినుండి ఆమె వెనకే పడుతూ ఉంటాడు ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు ముఖాన్ని అందరూ హేళన చేస్తుంటే నవ్వుతూ ఉండే వాళ్ళు అంటే తనకి ఇష్టమని ఆమె స్నేహం చేస్తుంది. అదే ప్రేమ అనుకున్న రాజు స్వీటీ ని ప్రేమిస్తాడు. ఆమెకు సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వెళ్ళిపోతుంది.
Also read:
Also read:
Advertisement
రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెనుక వెళ్తాడు. క్యాబ్ డ్రైవర్ గా మారతాడు. స్వీటీ కోసం బతుకుతాడు. ఆ తర్వాత రాజు కథ మలుపు తిరుగుతుంది. స్వీటీ రాజుల మధ్య చివరకు ఏం జరుగుతుంది..? కథ హ్యాపీగా ముగుస్తుందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాలి. రాజు యాదవ్ స్టోరీ రొటీన్ గానే ఉంది. ఈ మధ్యకాలంలో ఆర్ఎక్స్ 100, బేబీ వంటి సినిమాలు లాగే ఈ సినిమా కూడా ఉంది. ఈ మూవీలో నెక్స్ట్ ఏమవుతుంది అనేది రివిల్ అయిపోవడం ఆడియన్స్ కి ఆసక్తి తగ్గేలా చేస్తుంది.
ప్రతి ఊర్లో ప్రతి వీధిలో కూడా ఇటువంటి ప్రేమ కథలు ఉంటాయి రాజు స్వీటీల ప్రేమ కథ ముగిసిన తర్వాత వచ్చే సన్నివేశాలు గుండెను బరువెక్కిస్తాయి. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు చూస్తే కళ్ళంట నీళ్లు వస్తాయి. గెటప్ శ్రీనులో బుల్లితెర కమల్ హాసన్ ఉన్నాడని మరోసారి నిరూపించుకున్నాడు. తన ముఖంపై నవ్వు అనే కాన్సెప్ట్ ప్లస్, మైనస్ కూడా అయింది. ఓకే ఎక్స్ప్రెషన్స్ తో గెటప్ శ్రీను ని చూడడం బోరింగ్ గా ఉంది గెటప్ శ్రీను అంటే కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అదే మైనస్ అయిపోయింది. హీరోయిన్ తన పాత్రకి తగ్గట్టుగా న్యాయం చేసింది.
ప్లస్ పాయింట్లు:
నటీనటులు
సినిమాటోగ్రఫీ
ఎమోషన్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
కాన్సెప్ట్
రేటింగ్ 2.5/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!