Home » కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

by Bunty
Ad

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపిఎల్ లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2023 కాకుండా ఐపీఎల్ 2022 టోర్నమెంటులో కూడా ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లో విఫలమైన హైదరాబాదు జట్టు… పాయింట్స్ టేబుల్ లో చివరన నిలిచిపోయింది. ఎంత మంచి ఆటగాళ్లను తీసుకున్నా… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి ఏమాత్రం మారడం లేదు.

Advertisement

ఇక అయితే ఐపీఎల్ 2024 సంవత్సరం కోసం ఇప్పటినుంచే.. హైదరాబాద్ జట్టును పటిష్టంగా ఏర్పాటు చేసేందుకు ఓనర్ కావ్య మారాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే… హైదరాబాద్ జట్టు కోచ్ అయిన బ్రియాన్ లారా ను తప్పించి అతని స్థానంలో… వీరేంద్ర సెహ్వాగ్ ను కోచ్ గా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గిల్, పృద్విషాలను కూడా కొనుగోలు చేసేందుకు కావ్య ప్రయత్నం చేస్తుంది.

Advertisement

ఇలాంటి తరుణంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ తాజాగా చేసిన జైలర్ సినిమాను… హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య తండ్రి కళానిధి మారన్ నిర్మించారు. ఇక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ… హైదరాబాద్ జట్టు ఓడిపోయినప్పుడు… కావ్య పాప నిరాశగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు హైదరాబాద్ ఓడిపోవడo చూడలేక నేను కూడా చాలాసార్లు ఛానల్ మార్చేశాను అని తెలిపారు. అయితే హైదరాబాద్ ఐపీఎల్ కప్ కొట్టాలంటే… వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకోవాలి.. ముఖ్యంగా ఆల్రౌండర్లపై దృష్టి పెట్టాలి అని రజనీకాంత్ సూచనలు చేశాడు.

ఇవి కూడా చదవండి

బ్యాడ్ లక్ అంటే ఇదే… 99 పరుగులు కొట్టి నాటౌట్ గా మిగిలిపోయిన ఆటగాళ్లు వీరే !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

Visitors Are Also Reading