Home » అన్నాత్తే సినిమా టెక్నీషియన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్..!

అన్నాత్తే సినిమా టెక్నీషియన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్..!

by AJAY
Ad

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వచ్చింది అంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ముఖ్యంగా తమిళనాట రజినీ సినిమా వచ్చింది అంతే చాలు పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా రజినీ హీరోగా నటించిన అన్నాత్తే సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో అనుకున్న మేర సక్సెస్ అవ్వలేకోయినా తమిళంలో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా ఈ సినిమాలో రజనీ తరపున హీరోయిన్లు గా ఖుష్బూ, నయనతార,మీనా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్నగా విడుదల చేశారు.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే రజినీఖాంత్ తన సినిమాలకు పని చేసే దర్శకులు, నిర్మాతలు మరియు టెక్నీషియన్ లతో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారని టాక్. కాగా తాజాగా తన అన్నాత్తే సినిమాకు పనిచేసిన ఓ టెక్నీషియన్ కు గిఫ్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. రజినీ అన్నాత్తే సినిమాకు పని చేసిన ప్రధాన టెక్నీషియన్ కు బంగారు గొలుసును గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతే కాకుండా ఆ టెక్నీషియన్ ను ఇంటికి పిలిపించుకుని మరీ రజినీకాంత్ బంగారు గొలుసును టెక్నీషియన్ మెడలో వేశారు. సినిమా మంచి సక్సెస్ అవ్వడం…టెక్నీషియన్ పని తనం నచ్చి రజినీకాంత్ అలా గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేశాడు. దాంతో రజినీ కాంత్ లాంటి స్టార్ హీరో బంగారు గొలుసు ఇవ్వడం పై ఆ టెక్నీషియన్ ఆనందానికి అవధుల్లేవు.

Visitors Are Also Reading