ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నటి పవిత్ర లోకేష్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పవిత్ర లోకేష్ మరియు నరేష్ ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారని దానికి సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీరి వెడ్డింగ్ కు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని షాక్ కు గురి చేస్తున్నారు. మరి వీరి పెళ్లి జరిగిందా లేదా అనేది ఇంతవరకు క్లారిటీగా తెలియదు. కానీ మీరు దుబాయ్ కి హనీమూన్ కూడా వెళ్లారని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.
READ ALSO : ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి?
ఇలాంటి తరుణంలో నరేష్ పై ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నటుడు నరేష్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు.
READ ALSO : తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్
నరేష్ తనకు తమ్ముడు లాంటివారని, ఆయనతో కలిసి ఈ సినిమాలో పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు నరేష్ కత్తిలాంటి వాడని, నిత్య పెళ్లి కొడుకు అంటూ ఫన్నీగా పంచులు వేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా తెగ నవ్వుకున్నారు. ఇక నరేష్ గురించి సరిగ్గా చెప్పారంటూ చాలామంది నెటిజన్లు రాజేంద్రప్రసాద్ వాక్యాలను సమర్థిస్తున్నారు.
READ ALSO : Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!