Telugu News » Blog » గోపిచంద్ సినిమా నుండి తప్పుకున్న రాజశేఖర్….!

గోపిచంద్ సినిమా నుండి తప్పుకున్న రాజశేఖర్….!

by AJAY
Published: Last Updated on
Ads

ఒకప్పుడు హీరోలుగా మెప్పించిన సీనియర్ హీరోలు ఇప్పుడు నెగిటివ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అర్జున్, జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు నెగిటివ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో రాజశేఖర్ కూడా నెగిటివ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. గతంలో రాజశేఖర్ విలన్ గా చేస్తున్నారంటూ వార్తలు వినిపించినా ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

Advertisement

Rajashekar Gopichand

Rajashekar Gopichand

రీసెంట్ గా శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో రాజశేఖర్ విలన్ గా చేస్తున్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి రాజశేఖర్ తప్పుకున్నారని అంటున్నారు. అసలు కారణం తెలియదుగానీ ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నారో తెలియాలంటే ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.

Advertisement

rajashekar

rajashekar

ఇదిలా ఉంటే గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో ఇప్పటికే లౌక్యం, లక్ష్యం సినిమా లు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి రాజశేఖర్ తప్పుకోవడం వల్ల జగపతిబాబును విలన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

You may also like