తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎంతో గుర్తింపు సాధించారు దర్శకుడు రాజమౌళి. ఇంతలా ఆయన సక్సెస్ సాదించడానికి ఆయన టీం వర్క్ కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారట. ముఖ్యంగా రాజమౌళి అన్న కీరవాణి, భార్య రమా రాజమౌళి,వదిన శ్రీవల్లి ,కాలభైరవ, తండ్రి విజయేంద్రప్రసాద్ ఇలా ఆయన సక్సెస్ కి ఎంతో సహకరించారు. వీరందరిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కార్తికేయ . రాజమౌళి కొడుకు కార్తికేయది కీలకమైన స్థానం. ఆయన ఏ సినిమా తీసిన సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ డిజైన్ తో పాటు అనేక విషయాల్లో కీలకపాత్ర పోషిస్తారట. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారట.
also read:ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో 99 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ప్లేయర్లు వీరే..!
Advertisement
Advertisement
అయితే ఈ చిత్రానికి ఇండియా నుండి ఆస్కార్ అధికారిక ఎంట్రీ దక్కలేదు. దీనికోసం ఎంతో కష్టపడ్డారట. ఆస్కార్ నామినేషన్ కు పంపే ప్రాసెస్ నుండి మొదలు మూవీ బాధ్యతలు కార్తికేయ చేసుకున్నారు. అందుకే ఆస్కార్ వేదికపై కీరవాణి కార్తికేయను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారట. అలాంటిది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలకమైన విషయాలను బయటపెట్టారు.. ఆయన తన తండ్రి జక్కన్నను నాన్న అని అస్సలు పిలవరట. ఆయన మొదటి నుంచే బాబా అని పిలవడం అలవాటట.
also read:Allu Arjun: అల్లు అర్జున్ వేస్ట్ ఫెల్లో అంటూ తిట్టింది ఎవరో తెలుసా..?
అలాగే పిలుస్తానని నేను జీవితంలో మంచి రోజులు చెడు రోజులు చూసానని, ఒకానొక టైం లో నెలకు 3000కు పార్ట్ టైం జాబ్ చేశానని అన్నారు. అది డబ్బుల కోసం కాకుండా ఆత్మసంతృప్తి కోసం చేశానని, అది నేను రాజమౌళి నుండే నేర్చుకున్నాను అని తెలియజేశారు. అయితే కార్తికేయ రమా రాజమౌళి మొదటి భర్త సంతానం. అంతేకాకుండా ఒక కూతురు కూడా ఉంది. అలాగే ఆస్కార్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని వాదన వినిపిస్తోందని అడగగా, అదంతా అబద్ధమని పుకార్లు పుట్టించారని, కేవలం 8.5 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని కౌంటర్ ఇచ్చారు.
also read:సురేఖను దారుణంగా అవమానించిన స్టార్ హీరో భార్య.. చివరికి చిరు ఏం చేశారంటే..?