Home » జ‌క్క‌న్న మాస్ట‌ర్ ప్లాన్..3వేల మంది అభిమానుల‌తో ప్ర‌త్యేక ట్రైన్ లో ముంబై..!

జ‌క్క‌న్న మాస్ట‌ర్ ప్లాన్..3వేల మంది అభిమానుల‌తో ప్ర‌త్యేక ట్రైన్ లో ముంబై..!

by AJAY
Ad

సినిమాల్లోనే కాదు ప్ర‌మోషన్స్ లోనూ జ‌క్క‌న్న రూటే స‌ప‌రేటు. సినిమా షూటింగ్ పూర్త‌య్యిందంటే చాలు రాజ‌మౌళి సినిమా ప్ర‌మోష‌న్ లో ఫుల్ బిజీ అయిపోతుంటారు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన అన్ని సినిమాల‌కు భారీ రేంజ్ లో ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించారు. ఆయ‌న ప్ర‌మోష‌న్ ల వ‌ల్ల క‌లెక్ష‌న్ లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయ‌ని అనుకుంటారు. అంతే కాదు బాలీవుడ్ కోలీవుడ్ అన్ని ఇండ‌స్ట్రీల‌లోనూ త‌న ప్ర‌మోష‌న్ ల‌తో జ‌క్క‌న్న సినిమా టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తుంది. ఇక ఇప్ప‌టికే రాజ‌మౌళి పూర్తిచేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కూడా ప్ర‌మోష‌న్ లు షురూ చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Rajamouli

Rajamouli

రాజ‌మౌళి షూటింగ్ పూర్త‌య్యాక ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌తో ఎలాగూ గ్యాప్ ఇవ్వ‌ర‌ని ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వెకేష‌న్ ల‌కు కూడా వెళ్లి వ‌చ్చారు. ఇక మిగ‌తా సినిమాల‌న్నీ యూట్యూబ్ లో సినిమా ట్రైల‌ర్ అను విడుద‌ల చేస్తే జ‌క్క‌న్న మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైల‌ర్ ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు. అంతే కాకుండా థియేట‌ర్ లో ట్రైల‌ర్ ను వీక్షించారు. ఇదిలా ఉండ‌గానే జ‌క్క‌న్న ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్ ల‌కోసం మ‌రో మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సినిమా విడుద‌ల‌కు మ‌రో 25 రోజులు ఉన్న నేప‌థ్యంలో రాజ‌మౌళి గ్యాప్ లేకుండా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

అందులో భాగంగానే డిసెంబ‌ర్ 15న వ‌రంగ‌ల్ లో భారీ ప్రిరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే విధంగా రెండో ఈవెంట్ ను హిందీ ప్రేక్ష‌కుల కోసం ముంబైలో ఏర్పాటు చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ ఈవెంట్ లో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లు సంద‌డి చేయనున్నార‌ట. ఇక ఈ ఈవెంట్ కోసం జ‌క్క‌న్న మూడు వేల మంది అభిమానుల‌ను కూడా ట్రైన్ లో ముంబై తీసుకువెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading