Home » బ్రహ్మాస్త్ర ఎడిటర్ గా మారిపోయిన రాజమౌళి..!

బ్రహ్మాస్త్ర ఎడిటర్ గా మారిపోయిన రాజమౌళి..!

by Azhar
Ad

బాలీవుడ్ అనేది ప్రస్తుతం మన సౌత్ సినిమాల దాటికి తట్టుకోలేకపోతుంది అనేది నిజం. ఇక మన సినిమాలకు బ్రేక్ వేసే సినిమాలుగా అక్కడి ఇండస్ట్రీ కొన్ని సినిమాలు అనుకుంది. అందులో భాగంగానే వచ్చిన లాల్ సింగ్ చద్దా అనేది సూపర్ ప్లాప్ అయ్యింది. ఇక ప్రస్తుతం అక్కడి వారు అందరూ బ్రహ్మాస్త్ర సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో రన్ బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement

అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా రాబోతుంది అని ప్రకటించారు. కానీ బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ అనేది వచ్చిన తర్వాత దీనిపై నెగెటివ్ టాక్ అనేది వచ్చింది. ఎందుకంటే అందులో మొత్తం గ్రాఫిక్స్ ఉంది. అందుకే ఈ సినిమా ప్లాప్ అని ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను కాపాడేందుకు రాజమౌళి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.

Advertisement

ఈ సినిమాకు తెలుగులో మొదట రాజమౌళి సమార్పుకుడిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ సినిమాకు ఎడిటర్ గా కూడా మారిపోయాడట. అయితే ఈ సినిమాపై విమర్శలు అనేవి వచ్చిన నేపథ్యంలో రాజమౌళి ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో పూర్తిగా కలుగజేసుకుంటున్నట్లు తెలుస్తుంది. దాంతో రాజమోళి సిన్ లోకి వస్తే ఎలా ఉంటుందో ఆయన సినిమాలు చెబుతాయి. కాబట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి అనే ఆసక్తి మళ్ళీ ఫ్యాన్స్ లో కలుగుతుంది.

ఇవి కూడా చదవండి :

టీమిండియా దుబాయ్‌లో బ‌స చేసే హోట‌ల్‌లో రోజుకు ఎంతో తెలుసా..?

ఇండియా ప్రయోగాలు చెయ్యడం మంచిది కాదు..!

Visitors Are Also Reading