Home » జ‌క్క‌న్న ఆ తప్పు చేయ‌క‌పోతే ఆర్ఆర్ఆర్ మ‌రోలా ఉండేదా..?

జ‌క్క‌న్న ఆ తప్పు చేయ‌క‌పోతే ఆర్ఆర్ఆర్ మ‌రోలా ఉండేదా..?

by AJAY
Published: Last Updated on

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న థియేట‌ర్ ల‌లో విడుద‌లైంది. ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు. ఈ చిత్రానికి మొద‌టి రోజు వంద‌కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ లు రాగా మూడు రోజుల్లోనే 500 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్ప‌టికీ హౌస్ ఫుల్ గా థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది.

అయితే ఈ సినిమాలో జ‌క్క‌న్న చేసిన ఓ త‌ప్పు వ‌ల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల కాన్సెప్ట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మ‌ని ముందు నుండి టాక్ వినిపించింది. సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో….రామ్ చ‌రణ్ అల్లూరి సీతారామారాజు పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని టాక్ వినిపించింది.

అయితే సినిమాలో ఇద్ద‌రి పాత్ర‌లు అవే అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ పాత్ర పాపను ర‌క్షించేది అయితే చ‌ర‌ణ్ పాత్ర దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చేది. దాంతో చ‌ర‌ణ్ పాత్ర కాస్త హైలెట్ అయ్యింది. అంతే కాకుండా ఎన్టీఆర్ పాత్ర చ‌ర‌ణ్ పాత్ర‌కు స‌పోర్ట్ చేసేదిగా మిగిలింది.

రామ్ చ‌ర‌ణ్ కు సినిమాలో ఎలివేష‌న్స్ కాస్త ఎక్కువ‌గా ఉంటే ఎన్టీఆర్ కు మాత్రం ఎలివేష‌న్స్ త‌క్కువ అయ్యాయి. దాంతో ఎన్టీఆర్ అభిమానులు నిరుత్సాహ ప‌డుతున్నారు. కానీ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుతున్నాయి. యాక్టింగ్ లో ఎన్టీఆర్ చింపేశారు అని రివ్య్వూలు వ‌స్తున్నాయి.

Visitors Are Also Reading