సినిమా మేకింగ్ లో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. గుణశేఖర్ సినిమాల్లో సెట్స్ ఫేమస్…భారీ సెట్లతో గుణశేఖర్ సినిమాలు కన్నుల పండగలా ఉంటాయి. శంకర్ సినిమాల్లో సాంగ్స్ ను రిచ్ గా తీస్తాడు. సాంగ్స్ కోసమే శంకర్ నిర్మాతలతో కోట్లు ఖర్చు చేయిస్తాడు. అదే విధంగా దర్శకధీరుడు రాజమౌళికి కూడా ఓ స్పెషాలిటీ ఉంది. జక్కన్న సినిమాల్లో ఆయుదాలు ఫేమస్. సింహాద్రి సినిమా నుండి జక్కన్న ఆయుదాలను పరిచయం చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి: ఇండియా నాకు చాలా ఇచ్చింది.. అందుకే తిరిగి ఇస్తున్న..!
Advertisement
సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ ఓ గొడ్డలి పటుకుని కనిపిస్తాడు.ఆ గొడ్డలికి రెండు వైపులా పదును ఉంటుంది. ఆ గొడ్డలితో ఎన్టీఆర్ ఫైట్స్ చేస్తుంటే వార్రెవా అనుకున్నారు. ఆ గొడ్డలి డిజైన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఓ కత్తి పట్టుకుని కనిపిస్తాడు. దాని పిడి పెద్దగా ఉండి ముందు భాగం చాలా షార్ప్ గా ఉంటుంది. దాన్ని ప్రభాస్ తన నడుం వెనక నుండి టేబుల్ పై పెట్టి బెదిరించే సినిమాలో హైలెట్ అనే చెప్పాలి. ఈ కత్తి కూడా ఛత్రపతి తరవాత చాలా ఫేమస్ అయ్యింది.
Advertisement
విక్రమార్కులు సినిమాలో జక్కన్న ఓ కొత్తరకం ఆయుదాన్ని పరిచయం చేశాడు. ఇదివరకూ ప్రేక్షకులు ఎప్పుడూ అలాంటి ఆయుదాలను చూడలేదు. చూడ్డానికి ఒక రాడ్ చివరన చక్రం ఉంటుంది. దాంతో రవితేజ చేసే యాక్షన్ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలిచాయి.
ఈగ కోసం కూడా జక్కన్న ఓ ఆయుదం ఉంటుందని చెప్పాడు. ఈగ సినిమాలో ఈగ విలన్ చంపడానికి ఓ సూది పట్టుకుని తిరుగుతుంది. ఆ సూదితో విలన్ కంట్లో గుచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది.
బాహుబలి సినిమాలో రానా చేతిలో ఓ ఆయుదం ఉంటుంది. ఆ ఆయుదానికి ఉన్న గొలుసును చేతిలో పట్టుకునేందుకు వీలుగా ఉండగా గొలుసు చివరణ ఓ పెద్ద గుండ్రని నిర్మాణం ఉంటుంది. ఆ గొలుసును పట్టుకుని పట్టుకుని రానా తనపైకి వచ్చిన వారిని కబడ్డీ ఆడతాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో జక్కన్న రామ్ చరణ్ కు ఆయుదంగా బాణం ఇవ్వగా ఎన్టీఆర్ చేతిలో బల్లాన్ని పెట్టాడు. వీరిద్దరూ ఆ ఆయుదాలతో చేసే సీన్స్ హెలెట్ అనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి: అఖిల్ కాకుండా చైతూకు మరో తమ్ముడు ఉన్నాడన్న సంగతి తెలుసా..? అతడు ఏం చేస్తున్నాడంటే..?