Home » ఆర్ఆర్ఆర్ కోసం వెళితే పుష్ప గురించి అడుగుతున్నారు : రాజ‌మౌళి

ఆర్ఆర్ఆర్ కోసం వెళితే పుష్ప గురించి అడుగుతున్నారు : రాజ‌మౌళి

by AJAY
Ad

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యారు. ఈ సంధ‌ర్భంగా రాజమౌళి మాట్లాడుతూ… సుకుమార్ తన స్నేహితుడు… ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పారు. తనకు సుకుమార్ సినిమాలంటే చాలా ఇష్టం అని జ‌క్క‌న్న అన్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా సుకుమార్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఈ సినిమా అద్భుతంగా వస్తోందన్న‌ నమ్మకముందని… ఆర్ఆర్ఆర్ పని మీద ముంబై కి వెళ్ళినప్పుడు ఎవరిని అడిగినా పుష్ప కోసం ఎదురుచూస్తున్నాం అంటున్నారు అంటూ రాజమౌళి చెప్పారు.

Advertisement

Rajamouli

Rajamouli

అల్లు అర్జున్ తప్పకుండా అక్కడ కూడా ప్రచారం చేయాలని.. పుష్ప కేవలం బ‌న్నీ సినిమా మాత్రమే కాదని ఇది తెలుగు ఇండస్ట్రీ సినిమా అని వ్యాఖ్యానించారు. దీని గురించి అందరికీ తెలియాలని అల్లు అర్జున్ డెడికేష‌న్ కి హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలు కురిపించారు. అల్లు అర్జున్ డెడికేష‌న్ చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతారు అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటించారు. మరో విలన్ గా సునీల్ కూడా నటించాడు. ఈ చిత్రంలో అన‌సూయ కీలక పాత్రలో నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో సమంత ఐటం సాంగ్ చేసింది. ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో డిసెంబ‌ర్ 17న‌ విడుదల చేయబోతున్నారు. మ‌రి ఎన్నో అంచనాల మ‌ధ్య వ‌స్తున్న ఈ చిత్రం ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading