సీరియల్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం పాన్ వరల్డ్ డైరెక్టర్ గా జకన్న ఎదిగారు. జక్కన్న అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తరవాత డైరెక్టర్ గా రాజ మౌళి క్రేజ్ పాన్ ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది.
Advertisement
ఇక గత ఏడాది జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా రీసెంట్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం అందుకుని అరుదైన రికార్డును సాధించింది. ఇక ప్రస్తుతం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న రాజమౌళి సినిమాలలోకి ఎలా వచ్చారు అన్న విషయం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.
Advertisement
కాగా ఈ ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో జక్కన్న సమాధానం ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ పిక్చర్ కేటగిరీలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును సొంతం చేసుకున్న సంధర్భంగా రాజమౌళి మాట్లాడుతూ…. మా అమ్మ పేరు రాజనేంద్రి తనే నాలోని టాలెంట్ ను గుర్తించి నేను సినిమా రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. శ్రీవల్లి మా వదిన నాకు మరో అమ్మ. సినిమా రంగంలోకి వచ్చేలా ఆమె నన్ను ప్రోత్సహించారు.
నా భార్య రమా రాజమౌళి నా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుంది ఆ విషయం అందరికీ తెలుసు… అయితే నిజ జీవితంలో కూడా నా డిజైనర్ రమనే. నా కూతుర్లు నా కోసం ఏం చేయకపోయినా వాళ్ళ నవ్వు నాకు చాలు…. అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇండియా గురించి మాట్లాడుతూ “మేరా భారత్ మహాన్… జైహింద్” అంటూ వ్యాఖ్యానించారు.
Also read :సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉన్నాడో చూశారా..?