టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గురించి తెలియని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు అస్కార్ అవార్డు రావడంతో… ఓ రేంజ్ లోకి వెళ్లాడు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. అయితే.. తాజాగా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళికి ఓ అరుదైన గౌరవం దక్కింది.
Advertisement
ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ నూతన చైర్మన్ గా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఎంపిక అయ్యారు. ఐఎస్బిసి చీఫ్ ప్యాట్రన్ గా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎంపిక అయ్యారు. ఇప్పటికే ISBFC కి జాయింట్ సెక్రెటరీ గా రాజమౌళి కుమారుడు కార్తికేయ సేవలు అందిస్తున్నారు. ఇక తాజాగా ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ నూతన చైర్మన్ గా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ… నేను క్రికెట్ ఆడుతాను.. నాకు క్రికెట్ అంటే ఇష్టమని చెప్పారు.
Advertisement
స్కూల్ టైంలో మా ఊర్లో నేను క్రికెట్ ఆడేవాడ్ని అని… ఏలూరు లో కాలేజీ డేస్ లో క్రికెట్ టీంలో నేను ఒక్కడిగా ఆడేవాడ్ని అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. రూరల్ ప్లేసెస్ లో చాలా టాలెంట్ ఉంటుందని…. కానీ సరైన ప్లాట్ ఫామ్ ఉండదని వెల్లడించారు. ISBC నన్ను అప్రోచ్ అయి.. రూరల్ క్రికెట్ కోసం పని చేస్తున్నాం అనగానే ఓకే చెప్పానని పేర్కొన్నారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ISBC దేశ వ్యాప్తంగా విస్తరించిందని.. రూరల్ ప్లేయర్స్ కోసం పని చేస్తామన్నారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. కాగా, డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి.. త్వరలోనే మహేష్ బాబుతో భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
బట్లర్‌కు రాజస్తాన్ రాయల్స్ బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.40 కోట్లు!
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..