Home » నేను ఇలా ఎదగడానికి ఆ ఎడిటర్ కారణం..!

నేను ఇలా ఎదగడానికి ఆ ఎడిటర్ కారణం..!

by Azhar
Ad

రాహుల్ ద్రావిడ్ అనే పేరును క్రికెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తప్పకుండ వినే ఉంటారు. టెస్టులలో ఇండియా జట్టుకు వాల్ గా పేరు తెచుకున్న ద్రావిడ్.. ఇప్పుడు భారత జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవరిస్తున్నాడు. ఇక టెస్ట్ అలాగే వన్డేలలో 10 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ద్రావిడ్.. గ్రౌండ్ లో చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. అందుకే బౌలర్లు ద్రావిడ్ కు బౌలింగ్ చేయడం కష్టం అని భావిస్తారు. అయితే ద్రావిడ్ ఇలా అంతర్జాతీయ క్రికెట్ లో ఇంతలా ఎదగడానికి ఒక్క ఎడిటర్ కారణం అని కామెంట్స్ చేసాడు.

Advertisement

అయితే ఇప్పుడు భారత జట్టుతో కలిసి వెస్టిండీస్ లో ఉన్న ద్రావిడ్… ఒలంపిక్ మెడల్ విన్నర్.. షూటర్ అభినవ్ బింద్రాతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే తన సక్సెస్ కు కారణం చెప్పాడు. ద్రావిడ్ మాట్లాడుతూ… మనం సాధించే సక్సెస్ ఎలా ఉండాలి అంటే.. అది మన పేరును మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేయాలి అని చెప్పాడు. ఇక తాను కూడా అలంటి ఓ కారణంతోనే ఇలా ఉన్నాను అని అన్నాడు. అయితే అప్పట్లో స్కూల్ టోర్నీలకు సంబంధించిన వార్తలను కూడా పేపర్లలో వేసేవారు. అయితే నేను ఒక్క మ్యాచ్ లో సెంచరీ చేశాను. అందువల్ల నా పేరు అనేది పేపర్లలో వస్తుంది అనుకున్నాను. కానీ ఆ పేపర్ చూస్తే.. నా పేరు రాహుల్ డేవిడ్ ఐ ఉంది.

Advertisement

ఎందుకంటే.. ద్రావిడ్ అనే పేరు ఎవరికీ ఉండదు. అందుకే ఆ పేపర్ ఎడిటర్ డేవిడ్ అని అనుకోని అలా వేసాడు. కానీ అది చుసిన తర్వాత.. నేను సెంచరీ చేసినా నా పేర ఎవరికీ తెలియలేదు. అందుకే నా ఆపేరు అందరికి తెలిసేలా చేయాలి అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకే నా పేరు అదే పేపర్లో ఫ్రెంట్ లో వచ్చింది అని ద్రావిడ్ చెప్పాడు. అయితే ద్రావిడ్ అనేది ఇప్పుడు ఇండియాలోనే కాదు.. మొత్తం అందరికి తెలుసు. ఇక ద్రావిడ్ ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మన జట్టు ఇంకా ఒక్క ఐసీసీ టోర్నీలో కూడా పాల్గొనలేదు. కాబట్టి ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ20 ప్రపంచ కప్ లో ద్రావిడ్ జట్టు ఏం చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :

నిండు గ‌ర్భిణీ అయిన‌ప్ప‌టికీ ఒలింపియాడ్ బ‌రిలో హారిక‌

మళ్ళీ బ్యాట్ పట్టనున్న మిథాలీ… రిటైర్మెంట్ బ్యాక్…?

Visitors Are Also Reading