Home » జూలై 12న అనంత్ అంబానీని పెళ్లి చేసుకోబోతున్న రాధిక మర్చంట్ గురించి ఆసక్తికర విషయాలు ఇవే..!

జూలై 12న అనంత్ అంబానీని పెళ్లి చేసుకోబోతున్న రాధిక మర్చంట్ గురించి ఆసక్తికర విషయాలు ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ను జులై 12న ముంబైలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరికి సంబంధించి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మార్చి 01 నుంచి మార్చి 03 వరకు జరుగనున్నాయి. పలువురు వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు, ప్రముఖ వ్యక్తులు హాజరుకానున్నారు. కోకిలా బెన్ & ధీరూభాయ్ అంబానీ ఆశీస్సులతో పూర్ణిమబెన్ & రవీంద్రభాయ్ దలాల్,  రాధికతో కలిసి అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు సంతోషిస్తున్నామని ఆహ్వాన పత్రిక పంపారు.

Advertisement

Advertisement

  • రాధిక మర్చంట్ డిసెంబర్ 18, 1994న ముంబైలో వీరేన్ మర్చంట్-శైలా మర్చంట్ దంపతులకు జన్మించారు. వీరెన్ మర్చంట్ ప్రఖ్యాత ఫార్మాస్యూటికల్ సంస్థ ఎన్ కోర్ సీఈవో. ఆమె గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
  • ఆమె ది కేథడ్రల్ మరియు జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్‌లో చదివారు మరియు ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం BD సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా పొందారు. తరువాత, రాధిక మర్చంట్ న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ మరియు ఎకనామిక్స్‌ను అభ్యసించారు, 2017లో గ్రాడ్యుయేట్ అయ్యారు.
  • ఆమె ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఇస్ప్రవాలో జూనియర్ సేల్స్ మేనేజర్ గా చేరడానికి ముందు దేశాయ్  దివాన్షీ కన్సల్టింగ్ సంస్థలో ఇంటర్న్ షిప్ తో తన వృత్తిని ప్రారంభించింది.  ప్రస్తుతం ఆమె ఎన్ కోర్ హెల్త్ కేర్ లో డైరెక్టర్ పని చేస్తున్నారు. 
  • తనకు కాబోయే అత్తాగారు నీతా అంబానీ భరతనాట్యం నృత్యకారినణి. రాధిక ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ అకాడమీలో గురు భావన థాకర్ ఆధ్వర్యంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నట్టు తెలిపారు. 2022లో జియో వరల్డ్ సెంటర్ లో జరిగిన  వేడుకలో తన ప్రతిభను ప్రదర్శించింది. 
  • రాధిక మర్చంట్ మరియు అనంత్ అంబానీ డిసెంబర్ 2022లో రోకా వేడుక తరువాత.. వీరి నిశ్చితార్థ వేడుక జనవరి 2023లో ముంబైలోని అంబానీ నివాసమైనా యాంటియాలో జరిగింది.

Also Read :  ఈ లక్షణాలు ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటే జీవితం నాశనం అయ్యిపోతుంది..!

Visitors Are Also Reading