Home » RADHESHYAM : రాధేశ్యామ్ వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్ వ‌చ్చేసింది..!

RADHESHYAM : రాధేశ్యామ్ వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్ వ‌చ్చేసింది..!

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో పూజా హెడ్గే హీరోయిన్ గా న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా సంక్రాంతి విడుద‌ల‌ను ఈ సినిమా వాయిదా వేసుకుంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ సినిమా ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే.

Advertisement

Advertisement

అయితే నేడు ప్రేమికుల దినోత్స‌వం సంధ‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుండి వాలంటైన్స్ డే స్పెష‌ల్ గ్లింప్స్ ను విడుద‌ల చేసింది. ఈ గ్లింప్స్ ఎంత‌గానో ఆకట్టుకునే విధంగా ఉంది. ప్ర‌భాస్ పూజ మ‌ధ్య డైలాగులు భాగున్నాయి. అంతే కాకుండా క‌ల‌ర్ ఫుల్ గా క్లీన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఈ గ్లింప్స్ వీడియో క‌నిపిస్తోంది. మొత్తం ఐదు భాష‌ల్లో ఈ గ్లింప్స్ ను విడుదల చేశారు. కాగా వాలెంటైన్స్ డే రోజున గ్లింప్స్ విడుద‌ల కావ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు కుషీ అవుతున్నారు.

Visitors Are Also Reading